India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దముడియం మండలం చిన్నముడియంలో విషాదం నెలకొంది. పిడుగు పాటుకు దండు బాను ఓబులేసు (24) మృతి చెందాడు. తన పొలంలో కొర్ర పంటకు నీరు కట్టేందుకు వెళ్లినప్పుడు పిడుగు పడటంతో ఓబులేసు మృతి చెందాడు. మృతుడు S.ఉప్పలపాడులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెస్ రామారావు నేపథ్య గాయకుడు మన మధ్య లేకపోయినా కడప జిల్లా వాసులు మరచిపోలేరు. ఈయనకు సుందరదాసు అనే బిరుదు కలదు, రామాయణ భాగం, సుందరకాండ, హనుమాన్ చాలీసా మంచి గుర్తింపు ఖ్యాతి తెచ్చి పెట్టాయి. గతంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రంలో ప్రతిరోజు ఉదయం పూట సుందరకాండ పారాయణం పాట ప్రసారం చేసేవారు. దానితో ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుండేది. నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి.
మైదుకూరు నియోజకవర్గం చల్ల బసాయిపల్లి సమీపంలోని శ్రీ గోపాలకృష్ణ సేవాసమితి ముక్తిధామం గోశాలను శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ సందర్శించారు. గోవుల పోషణ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గోసేవ మహా పుణ్య కార్యమని ఆయన నిర్వాహకులను ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్, ఆర్డీవో సాయిశ్రీ పాల్గొన్నారు.
నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే పోలీసులు చీపుర చేతబట్టి చెత్త ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.
కడపలో చాలా మంది తమ ఫోన్లు పొగొట్టుకున్నారు. పోలీసులు ఎంతోకష్టపడి 602 ఫోన్లు రికవరీ చేశారు. ఇందులో 275 మంది తమ మొబైల్స్ తీసుకెళ్లారు. ఇంకా 327 ఫోన్లు పోలీసుల దగ్గరే ఉన్నాయి. సరైన ఆధారాలు చూపింది వీటిని తీసుకెళ్లాలని కడప సైబర్ క్రైం పోలీసులు కోరారు. మరిన్ని వివరాలకు 08562 245490 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కడప ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి దాదాపు 20మందితో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కడప నుంచి బయల్దేరింది. గద్వాల(D) ఇటిక్యాల(M) మండలంలోని ప్రియదర్శి హోటల్ వద్ద హైదరాబాద్ నుంచి నంద్యాల వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి కడప బస్సు పైకి దూసుకొచ్చింది. కారులోని ఇద్దరు చనిపోగా.. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్యామేజ్ కావడంతో కడప ప్రయాణికులను మరో వాహనంలో HYD తరలించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేంపల్లి చెందిన సుబ్రహ్మణ్యంను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు నియామక ధ్రువపత్రాన్ని ఆయనకు మాజీ ఎంపీ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు సూచించారు.
రామాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా కడప – రాయచోటి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం గొల్లపల్లికి చెందిన పప్పిరెడ్డి ఇరగం రెడ్డి మృతిచెందారు. ద్విచక్రవాహనంలో రోడ్డు దాటుతుండగా, కడప నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ఢీ కొట్టింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వేంపల్లెలో ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులు ఫాజిల్, ఆనంద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా నిందుతులకు రిమాండ్ విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
నెల్లూరు జిల్లాలో వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు కడప జిల్లా వైపు రావడంతో కడప పోలీసులకు సమాచారమిచ్చారు. లింగాపురం వద్ద కాపు కాసిన పోలీసులను చూసి కల్లూరు మీదుగా పరారయ్యారు. వి.రాజుపాలెం వద్ద ఒకరు దొరకకగా ఇద్దరు జంపయ్యారు. ట్రైనీ DSP భవాని, చాపాడు, కమలాపురం పోలీసుల సమన్వయంతో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.