India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అర్బన్ సీఐ నరసింహులు హెచ్చరించారు. శనివారం రాత్రి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఆయన వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లైసెన్సు లేని వాహనదారులకు, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారికి జరిమానాలు విధించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్, తమ వాహన పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి కడప జిల్లా MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపారు. మందపల్లి, ఆకేపాడు గ్రామాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అక్రమణ ఆరోపణలపై రాజంపేట MLA, ఆయన కుటుంబ సభ్యులు నేడు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను, వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన విక్రయం కింద బదలాయించుకుని, అందులో ఎస్టేట్ నిర్మించుకున్నారని సుబ్బనరసయ్య ఫిర్యాదు చేశాడు.
కడప జిల్లాలో టమాట రైతులు పంట పండించి ఎలాంటి గుర్తింపుకార్డు లేకపోయినా రైతు బజార్లో సరుకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు కలెక్టర్ శ్రీధర్, జేసీ అతిథి సింగ్ తెలిపారు. కూరగాయల పంట సీజన్ కావడంతో అధిక దిగుబడి వచ్చిందని, గ్రామాల్లో ధర లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చన్నారు.
శ్వాస ఆగితే మనిషి, భాష ఆగితే జాతి మరణిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డా.తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేంపల్లి తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు పండితులు ధర్మా రెడ్డి ,కృష్ణవేణి, పద్మజ తదితరులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామాలకు వెళ్లి గస్తీ నిర్వహించి ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పులివెందుల సమస్యల పరిష్కారం కోసం జగన్ సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని బీటెక్ రవి అన్నారు. వెంపల్లెలో గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు పులివెందుల ప్రజలు అంటే ప్రేమ లేదని విమర్శించారు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నా జగన్ పట్టించుకోవడం లేదన్నారు. పులివెందులకి ఉప ఎన్నికలు వస్తాయని రవి మరో సారి ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్ల చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమరావతి నుంచి సీస్ విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. ఇంటర్ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్-2 సర్వీసెస్ మెయిన్ పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై లైజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు.
తిరుపతి రూరల్ మండలం, రామానుజపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఒకరు కడప జిల్లా, బురిడపల్లి గ్రామానికి చెందిన సాహిర్ బాషా కాగా, మరో యువతి పీలేరు, రామానాయక్ తాండాకు చెందిన బుక్కే యమునాగా పోలీసులు గుర్తించారు. యమునా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం పుత్తూరుకి వెళ్లి వస్తుండగా రాంగ్ రూట్లో వచ్చి టిప్పర్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
వేముల మండలం కేకే కొట్టాల గ్రామ సమీపంలో ఈనెల 2వ తేదీన సింగంశెట్టి పద్మావతి అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి ముద్దాయిని అరెస్టు చేసినట్లు సీఐ ఉసలయ్య, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ముద్దాయితోపాటు బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచామన్నారు. బంగారం నగల కోసమే హత్య చేశారన్నారు.
Sorry, no posts matched your criteria.