Y.S.R. Cuddapah

News April 15, 2025

ఉమ్మడి కడప జిల్లాలో 106 పోస్టులు

image

ఉమ్మడి కడప జిల్లాలో 106 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 57 SGT(ప్రాథమిక స్థాయి), 49 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

News April 15, 2025

ఒంటిమిట్ట: పుష్పయాగానికి సిద్ధం చేస్తున్న అధికారులు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ అధికారులు కావలసిన వివిధ రకాల పుష్పాలను ఆలయానికి సమకూర్చారు. పుష్పయాగానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

News April 15, 2025

కడప: రూ.1.8 కోట్ల విలువచేసే 602 ఫోన్ల రికవరీ

image

కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేశారు. కడపలోని ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలోని పెన్నేరు హాల్‌లో ఎస్పీ అశోక్ కుమార్ మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సుమారు రూ.1.8 కోట్ల విలువచేసే 602 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు.

News April 15, 2025

నేడు మొబైల్ రికవరీ మేళా: ఎస్పీ

image

కడప జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్‌ను బాధితులకు అందజేసేందుకు ఈ రోజు మొబైల్ రికవరీ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులు సరైన రికార్డులు తీసుకుని వస్తే మొబైల్స్ అందజేస్తామన్నారు

News April 14, 2025

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన కడప జిల్లాలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద కడప నుంచి వస్తున్న బస్సు, పోలీసుల బొలెరోను జీపు ఢీకొంది. ఈ ప్రమాంలో పోలీసుల బొలెరోలోని కానిస్టేబుల్, డ్రైవర్‌కు గాయాలు కాగా.. జీపులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. మృతులు నంద్యాల హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2025

ఒంటిమిట్టలో 41.4 °c ఉష్ణోగ్రత నమోదు..

image

కడప జిల్లా ఒంటిమిట్టలో ఆదివారం అత్యధికంగా 41.6°c డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన ఎండ శాతం వివరాలను ప్రకటించగా ఇందులో కడప జిల్లాలో ఒంటిమిట్టలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు అందులో పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి కాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News April 14, 2025

కడప: పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంబేడ్కర్ జయంతి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎవరూ రావద్దు అని సూచించారు.

News April 13, 2025

కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతోశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

News April 13, 2025

కడప జిల్లాలో గత ఐదేళ్ల ఇంటర్‌ ఫలితాలు ఇవే..

image

☛ 2021 అకడమిక్‌ ఇయర్‌లో కరోనా కారణంగా 100 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
☛ 2022లో ఇంటర్‌ ఫస్టియర్ 41 శాతం.. సెకండియర్ 50 శాతం ఉత్తీర్ణత
☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత
☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
☛ 2025లో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 75 శాతం ఉత్తీర్ణత
కరోనా సమయంలో తప్ప ప్రతి ఏడాది కడప జిల్లా ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతూ పోతోంది.

News April 13, 2025

వేంపల్లి: 10వ తరగతి బాలికపై అత్యాచారం

image

వేంపల్లి మండలంలోని పదో తరగతి బాలికపై ఫాజిల్ అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ‘ఇటీవల బాలికను వేంపల్లె గాంధీరోడ్డులో చికెన్ దుకాణంలో పనిచేసే ఫాజిల్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసును నమోదు చేశాం. అలాగే అతడికి సహకరించారని చికెన్ దుకాణం ఓనర్ ఆనంద్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సీఐ తెలిపారు.