India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు తెలిపారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు సృష్టించే పోస్టులు ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదని హెచ్చరించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగానూ.. పార్టీల మధ్య చిచ్చులు పెట్టేలాంటి పోస్టులకు దూరంగా ఉండాలని కోరారు. మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్‌తో పాటు 15 మంది విప్‌లను ప్రకటించింది. ఇందులో కడప జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. వీరిలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి(TDP), జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(BJP), కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(జనసేన)ను విప్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. NDA ప్రభుత్వం కడప జిల్లాలో మూడు పార్టీలకు సమన్యాయం చేశారని కూటమి నాయకులు భావిస్తున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని నంగనూర్‌పల్లిలో మంళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. RTC ఏఎస్ఐ భైరగాని మునయ్య ఇంట్లో దొంగలు సుమారు 25 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగింది. దొంగతనాన్ని గుర్తించకుండా సనీ పక్కీలో వారు ఇల్లంతా కారంపొడి చల్లి, తమ ముద్రలను కనపడకుండా జాగ్రత్త పడ్డారు.
YS జగన్ మాట్లాడేందుకు మైక్ ఇస్తాం.. పులివెందుల పౌరుషం ఉంటే అసెంబ్లీకి రావాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో ఏ అంశంపైన అయినా చర్చకు సిద్ధం. తప్పులు చేసినందుకే జగన్ అసెంబ్లీకి రావడం లేదు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, అనుచిత పోస్టులు పెడితే ఊరుకోమని చట్ట ప్రకారం కచ్చితంగా శిక్షిస్తాం’ అని స్పష్టం చేశారు.
2024-2025వ సంవత్సరం సంపద సృష్టి లక్ష్యంగా అభివృద్ధి చక్రాన్ని పున: ప్రారంభించే ఉద్దేశ్యంతో రూ.2,94,427.25 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటిలో రాష్ట్ర బడ్జెట్‌పై కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టీడీపీ నాయకులు శివప్రసాద్ నాయుడు, బీజేపీ నాయకులు వెంకటరమణ గౌడ్ పాల్గొన్నారు.
ఆధార్ నమోదు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే సర్వీసు ఛార్జీలను చెల్లించాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలకు సూచించారు. జిల్లాలో ఆధార్ సేవల నిర్వహణపై సోమవారం జేసీ అదితి సింగ్, ఆర్డీవోలు జిల్లాలోని పలు ఆధార్ సేవ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆధార్ సేవాకేంద్రాల్లో సేవలు అందించాలన్నారు.
వెంపల్లెలో సోమవారం రాత్రి కొందరు రెచ్చిపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంపల్లెలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
కడప జిల్లాలో వేర్వేరు చోట్ల నదిలో దిగి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు మండలం వాటర్ గండి వద్ద పెన్నా నదిలో పడి కడపకు చెందిన బిల్లపాటి బాబు మృతి చెందినట్లు CI పురుషోత్తమరాజు తెలిపారు. CKదిన్నె మండలం బుగ్గవంక డ్యామ్‌లో చేపల వేటకు వెళ్లి ఇప్పెంట గ్రామం యానాది కాలనీవాసి తాటిముక్కల అంకయ్య (54) మృతి చెందాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కడప ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, యువతకు ఉద్యోగ కల్పన, పరిశ్రమలు, గండికోట అభివృద్ధి వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన MLAలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
రాష్ట్రస్థాయి అండర్ – 14 రగ్బీ పోటీల్లో వేంపల్లె జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ తెలిపారు. కమలాపురంలో జరిగిన ఈ రగ్బీ పోటిల్లో బాలికల విభాగంలో బిందు మాధవి 2వ స్థానం, బాలుర విభాగంలో నూరుల్లా 3వ స్థానంలో రాణించినట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపడంతో హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.