Y.S.R. Cuddapah

News April 23, 2025

గుంటూరు యువకుడిపై.. కడప యువతి ఫిర్యాదు

image

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.

News April 23, 2025

జగన్‌ను కలిసిన కడప నేతలు

image

మాజీ సీఎం జగన్‌ను కడప జిల్లా వైసీపీ నేతల కలిశారు. తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసంలో ఇవాళ సమావేశం జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇతర నాయకులు అక్కడికి వెళ్లారు. పీఏసీలో తనకు చోటు కల్పించడంపై జగన్‌కు అంజద్ బాషా ధన్యవాదాలు తెలిపారు. 

News April 23, 2025

కడప జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

కడప జిల్లా నూతన జడ్జిని కలసిన ఎస్పీ

image

కడప జిల్లా నూతన జడ్జిగా యామిని నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని చర్చించుకున్నారు. కేసుల పరిష్కారం, మహిళల భద్రత, నేరాల నివారణపై మాట్లాడుకున్నారు.

News April 22, 2025

దళితులకు అన్యాయం జరగకూడదు: కలెక్టర్

image

దళితులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని, కడప జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలాని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆదేశించారు. తన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు.

News April 22, 2025

కడప జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిపాదనల మేరకు 10 మందికి స్థానచలనం కల్పించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు. 

News April 22, 2025

సివిల్స్‌లో చెన్నూరు యువకుడికి 151వ ర్యాంకు

image

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(సివిల్స్) ఫలితాల్లో కడప జిల్లా యువకుడు సత్తా చాటాడు. చెన్నూరుకు చెందిన నేలటూరు శ్రీకాంత్ రెడ్డికి 151వ ర్యాంకు వచ్చింది. మొదటి, రెండో ప్రయత్నంలో ప్రిలిమినరీ, మెయిన్స్ పాసయ్యారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. తాజా ఫలితాల్లో సివిల్స్ సాధించారు. ఇండోర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

News April 22, 2025

కడప జిల్లా యువతికి 494 మార్క్స్

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా యువతి సత్తా చాటింది. ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరుకు చెందిన ఎద్దుల శివారెడ్డి, లక్ష్మీకొండమ్మ కుమార్తె పూజిత ఎంఈసీ చదువుతోంది. 500 మార్కులకు గాను 494 సాధించింది. ఇంగ్లిషులో 78, సంస్కృతంలో 99, మ్యాథ్స్ 1ఏలో 50, 1బీలో 50, ఎకనామిక్స్‌లో 99, కామర్స్‌లో 98, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో 20 మార్కులతో సత్తా చాటింది. ఆమెను అందరూ అభినందించారు.

News April 22, 2025

కడప: నాగాలాండ్‌కు బదిలీ అయిన యువజన అధికారి

image

ఉమ్మడి కడప జిల్లా నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణికంఠ కడప నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. జిల్లాలో ఐదు సంవత్సరాల పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. బదిలీపై వెళుతున్న మణికంఠను స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.

News April 22, 2025

కడప జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.