Y.S.R. Cuddapah

News August 9, 2024

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఇటీవల పుంగనూరులో జరిగిన టీడీపీ శ్రేణుల దాడిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర హోం శాఖ ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఎంపీ మిథున్ రెడ్డికి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిరంతరం ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఉండబోతుంది.

News August 9, 2024

ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వాయిదా పడ్డ పాఠశాల వివరాలు

image

బి.కోడూరు మండలంలో ఒక పాఠశాల, బి.మఠంలో 2, బద్వేల్లో 2, సీకేదిన్నె 4, చక్రాయపేట 1, చాపాడు 1, గోపవరం 4, కడప 13, కలసపాడు 2, కొండాపురం 3, మైలవరం 1, సిద్దవటం 6, తొండూరు 1, వీఎన్ పల్లి 2 పాఠశాలలో ఎన్నికలు జరగలేదు. అలాగే వల్లూరు 1, ఒంటిమిట్ట 2, వేముల 1, పోరుమామిళ్ల 2, ప్రొద్దుటూరు 2, పులివెందుల ఒక పాఠశాలలో వివిధ కారణాలతో జిల్లా వ్యాప్తంగా ఎస్ఎంసి ఎన్నికలు వాయిదా పడ్డాయి.

News August 9, 2024

వైయస్సార్ జిల్లాలోని 34 మంది ఎస్బీ సిబ్బంది బదిలీ

image

వైయస్సార్ జిల్లా వ్యాప్తంగా 34 మంది స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు ఏఎస్ఐలు, 16 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది పోలీస్ కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీరు బదిలీ అయిన కొత్త ప్రాంతాల్లో వెంటనే జాయిన్ కావాలని ఆదేశించారు.

News August 9, 2024

కడప: 1999 స్కూళ్లలో ఎస్ఎంసీ ఎన్నికలు.. 52చోట్ల వాయిదా

image

జిల్లా వ్యాప్తంగా గురువారం 2051 స్కూళ్లలో ఎస్ఎంసి ఎన్నికలు జరగాల్సి ఉండగా 1999 స్కూళ్లలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1602 ప్రాథమిక, 115 ప్రాథమికోన్నత, 282 ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 1357 పాఠశాలల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా వివిధ కారణాలతో 52 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికారులు ఎన్నికలను పర్యవేక్షించారు.

News August 9, 2024

కడప జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలి

image

ఆకాంక్ష జిల్లాల ఆశయాలకు అనుగుణంగా.. అధికారులు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. గురువారం నీతి అయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం జిల్లాలో కార్యాచరణ, ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప నుంచి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

News August 8, 2024

గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలు రాక

image

గండికోట ప్రాజెక్టుకు ఈనెల 11న కృష్ణాజలాలు రానున్నట్లు జి.ఎన్.ఎస్..ఎస్. సీఈ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. గురువారం గండికోట ప్రాజెక్టును జి.ఎన్.ఎస్.ఎస్ అధికార బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా గండికోట గేట్లను, సొరంగాన్ని వారు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జి.ఎన్.ఎస్.ఎస్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News August 8, 2024

కడప మీదుగా వెలంకణ్ణికి ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముంబైలోని బాంద్రా టెర్మినల్ నుంచి వెలంకణ్ణికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ప్రకటనలో తెలిపారు. బాంద్రా టెర్మినల్ నుంచి ఆగస్టు 27, సెప్టెంబర్ 6, తిరుగు ప్రయాణంలో వెలంకణ్ణి నుంచి 29 ఆగస్టు, సెప్టెంబర్ 8 తేదీలలో పుణే, గుంతకల్, కడప, రేణిగుంట, విల్లుపురం మీదుగా ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు.

News August 8, 2024

ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి గురువారం తెలిపారు. ఆదివాసీ దినోత్సవం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

News August 8, 2024

కడప జిల్లాలో 63 మంది SIలు బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ గురువారం కర్నూల్ రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా 63 మంది SIలకు స్థానచలనం చేశారు. వీరికి కేటాయించిన పోలీస్ స్టేషన్ల‌లో చేరే తేదీలను రికార్డు కోసం తెలియజేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు సూచించారు.

News August 8, 2024

వివేక హత్య కేసుపై.. కడప SPని కలిసిన YS సునిత

image

కడప ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును వివేకా కుమార్తె సునీతరెడ్డి బుధవారం కలిశారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సీబీఐకి, తమకు పోలీసులు సహకరించలేదని, స్థానిక పోలీసులు నిందితులకు అండగా నిలిచారన్నారు. ఈ కేసులో తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో స్థానిక పోలీసులు కేసును నీరుగార్చేలా వ్యవహరించారని అన్నారు.