India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.

కడప పరిశ్రమల శాఖలో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన కె.కృష్ణమూర్తిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొప్పర్తి పరిశ్రమల అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉషశ్రీని విచారణాధికారిగా, ఈశ్వరచంద్‌ను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ GO జారీ చేసింది.

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.

బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు బి.పద్మావతి అధ్యక్షతన బాలల హక్కుల పరిరక్షణ గురించి వివరించారు. వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.

డాక్టర్. వైఎస్సార్ వర్సిటీ లో అప్లైడ్ ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల చిత్ర కళా ప్రదర్శన శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తాము అద్భుతంగా రూపొందించిన కళలను ప్రదర్శించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య విశ్వనాథ కుమార్ విద్యార్థులు రూపొందించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని ప్రశంసించారు.. నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు తగిన సూచనలు అందజేశారు.

అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బలమైన ఈదురుగాలులకు అరటి గెలులతో ఉన్న చెట్లు పడిపోగా.. ప్రస్తుతం అరటికాయల ధరలు పడిపోయాయి. అరటి రైతుల పరిస్థితి ‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం టన్ను అరటికాయల ధరలు నాలుగైదు వేలు పలుకుతున్నాయి. అరటి కాయలను ఉన్న ధరలకు అమ్ముదామనుకుంటే వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకు రావడంలేదు.

అన్నమయ్య జిల్లాలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పది పరీక్షలో పెయిల్ అయ్యానని ములకలచెరువు మండలం పెద్దమోరవ పల్లికి చెందిన నవనీ (15) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అలాగే గుర్రంకొండకు చెందిన విష్ణు వరుసగా మూడు సార్లు పది పరీక్షలు రాశాడు. అయినా ఫెయిల్ అవుతుండటంతో మనస్థాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో అన్నమయ్య జిల్లా ఉలిక్కి పడింది.
Sorry, no posts matched your criteria.