India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తండ్రీ కొడుకులు బైక్‌పై బయటకు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి కొడుకు మృతి చెందిన ఘటన రాజంపేటలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాజంపేటలోని పాత బస్టాండ్ సర్కిల్‌లో ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడుకు చెందిన తండ్రీ బాబూరామ్, పెద్ద కుమారుడు శ్యామ్ (5)బైక్‌పై వెళ్తున్నారు. బండి ఒక్కసారిగా స్కిడ్ అయి కొడుకు తల బలంగా రోడ్డును తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సంబేపల్లి మండలం సోమవరం గ్రామం బావులకాడపల్లి జగనన్న కాలనీ సమీపంలోని వ్యవసాయ పొలంలో, పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పుల్లంపేట మండలం జాగువారి పల్లి వద్ద కడప – చెన్నై జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు – లారీ ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న సింహాద్రిపురం, చింతకొమ్మదిన్నె ఎస్సైల భార్యలకు స్వల్ప గాయాలయ్యాయి. మరో లారీ డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో సుమారు 600 లీటర్లు డీజిల్ రోడ్డుపై పడింది. పొరపాటున మంటలు చెలరేగి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేది. ఘటన స్థలానికి పుల్లంపేట పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు.
దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.
కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి నేటి నుంచి ఈనెల 13 వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 14వ తేదీన తరగతులు తిరిగి మొదలవుతాయి. BL, LLB సెమిస్టర్ పరీక్షలు ముందుగా సూచించినట్లు ఈనెల 8, 10వ తేదీల్లో యథావిధిగా కొనసాగనున్నాయి. ఏపీఐసెట్ స్పాట్ అడ్మిషన్లు వైవీయూలో 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనను నియమించడం పట్ల రాచమల్లు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కడప జిల్లాలో పలువురు వీఆర్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్ 1, 2 విలేజ్ రెవెన్యూ అధికారులు 83 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా 48 మందిని బదిలీ చేశారు. అనంతరం 15, 6, 12, 2 ఇలా వరుసగా 5 ఉత్తర్వులు విడుదల చేశారు. వీళ్లందరిని కొందరిని కడప జిల్లాలోని పోస్టింగ్‌లు ఇవ్వగా మరికొందరిని అన్నమయ్య జిల్లాకు బదిలీ చేశారు.
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.
మత మార్పిడితో ఓ వ్యక్తి వివాహం చేసుకున్న ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన భూషణ్ రెడ్డి కుమార్తెను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. ఇంట్లో వాళ్లు రూ.4.8 లక్షల నగదు, 26 తులాల బంగారం తీసుకెళ్లారని, పాస్ పోర్ట్‌కు దరఖాస్తు చేశారని తన కుమార్తెను సౌదీలో అమ్మేస్తాడేమోనని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.