India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెప్టెంబర్ 9 నుంచి 23 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో NGOలు ప్రచురించిన మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాల కరపత్రాలను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటరాముడు, జూటురు విజయ్ కుమార్, సూలం లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేసేలా సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.
కడప జిల్లాలో ప్రజలు అందించే సమస్యల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తూ.. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ షర్మల నివాళులర్పించారు. అనంతరం తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ‘ప్రజల గుండెల్లో చిరకాలం చెరగని సంతకం చేసిన గొప్పనేత వైఎస్సార్. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా నాన్న మన మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారు. నాన్న ఆశయాలే .. లక్ష్య సాధనగా నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాయి.’ అని Xలో పోస్ట్ చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం తన తండ్రిని గుర్తు తెచ్చుకుని ‘We miss you, Dad’ అని ట్వీట్ చేశారు. దీనికి నివాళి అర్పించిన ఫొటోలను జత చేశారు.
ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నరేశ్ బాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరంలో వివిధ కరణాల వల్ల, తెలిసీ తెలియక జరిగిన దోషాలను నివారించేందుకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని ఆయన తెలియజేశారు.
తొండూరు మండలంలో 2 చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. 2 రోజుల క్రితం సైదాపురం, ఆడపూరు మధ్యలో గల నాగలకట్ట సమీపంలోని ఇసుకమెట్టల వద్ద చిరుత పులి కనిపించిందని గ్రామస్థులు, పశువుల కాపరులు తెలిపారు. ఆదివారం ఇనగలూరు, సైదాపురం వాగులో 2 చిరుతపులులు సంచరిస్తుండగా పశువుల కాపర్లు చూసి స్థానికులకు తెలుపగా వారు వెంటనే సంబంధిత అటవీశాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.
దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రేపు ఇడుపులపాయలో YS జగన్ నివాళి అర్పించనున్నారు. రేపు ఉదయం పులివెందుల నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 6.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం తన తండ్రి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని యాజమాన్యాల విద్యా సంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించారు. సంబంధిత యాజమాన్యాలు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.