India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసే పత్తి సత్యనారాయణ శనివారం రోజు మాదిరే వారి డ్యూటీ ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో బద్వేల్‌కు వెళ్తుండగా ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుక వెళ్లేలోపే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు సత్యనారాయణకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సత్యనారాయణ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడప నగరానికి చెందిన ఎర్రనాగుల అమృతవల్లి అమెరికాలో ఏడాదికి రూ.1.70 కోట్ల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు. ఆమె జేఈఈ పరీక్షలో ప్రతిభ చూపి దుర్గాపూర్ ఎన్‌ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివారు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తిచేశారు. అనంతరం అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం పొందింది. జిల్లాలోని 30 మండలాలలో 97.08 శాతం పంపిణీ చేసినట్లు డిఆర్డిఏ అధికారులు వెల్లడించారు. 2,15,197 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేసినట్లు తెలియజేశారు. జిల్లాలో మిగిలిపోయిన లబ్ధిదారులకు సోమవారం పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు.
వేసవిని తలపించే విధంగా ఎండలు కాసి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. రెవెన్యూ డివిజన్లో శనివారం 97.0 మిమీ, బ్రహ్మంగారిమఠం 12.2. కాశినాయన 28.2, కలసపాడు 30.4, పోరుమామిళ్ల 21.2,బి.కోడూరు 10.8, బద్వేలు 3.6,గోపవరం 3.2, అట్లూరులో 16.6,వర్ష పాతం నమోదైనట్లు వ్యవసాయ గణాంక అధికారిణి క్రిష్ణవేణి తెలిపారు.
కడప నగర శివారులోని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేవీకే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య తెలిపారు. ఈ శిక్షణ పై ఆసక్తి ఉన్నవారు 98488 09236 నంబర్‌కు కాల్ చేసి తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ముద్దనూరు మండలం సామాజిక పింఛన్లకు అనర్హులైన కొందరు లబ్దిదారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్న 57 మందిని ప్రభుత్వం తొలగించినట్లు ఎంపీడీఓ చంద్రమౌళీశ్వర్ తెలిపారు. ఆ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు సంబంధించి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల తదితర పింఛన్లు 5,318 ఉన్నాయన్నారు. కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పింఛన్లు పొందుతున్నారన్నారు.
గాలివీడు మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన మైనర్ బాలికకు ఆమె తల్లిదండ్రులు, వారి బంధువుల ప్రోద్బలంతో ఆగస్టు 22న వివాహం జరిపించారు. ఈ విషయమై ఐసిడిఎస్ సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు బాల్య వివాహ నేర చట్టం క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ అనంతరం పెళ్లి కుమారుడు, వారి తల్లిదండ్రులు, బంధువులు మొత్తం 7 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
కడప నగరం వై.ఎస్. రాజారెడ్డి స్టేడియంలో ఆదివారం నిర్వహించాల్సిన అండర్- 14 కడప జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం తగ్గిన తర్వాత మళ్లీ ఎప్పుడు ఎంపికలు నిర్వహించేది. త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు
సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు పొందవచ్చని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివరాలకు 7995095800 మొబైల్ నంబర్ ద్వారా అనుమతులు కోరాలని తెలిపారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటన వివరాలు తెలిపారు. రేపు ఆమె హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రయం చేరుకొని ఇడుపులపాయకు వెళ్లి రాత్రి బసచేస్తారు. 2వ తేదీ తన తండ్రి YSR సమాధి వద్ద నివాళులర్పిస్తారు. 3వ తేదీ జిల్లా కలెక్టర్‌ను కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు.
Sorry, no posts matched your criteria.