India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను కడప జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసే ఆకాంక్షతో జిల్లాల లక్ష్య సాధనకు కృషి చేయాలని, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ది పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో నీతి ఆయోగ్ సీఈవో వీసీ ద్వారా శుక్రవారం సమీక్షించారు. సంబందిత శాఖలు అన్ని పారామీటర్లు 100% లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈనెల 22న కడపకు వస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాజమండ్రి నుంచి ఆయన రైలు మార్గాన ఆదివారం ఉదయం కడపకు చేరుకుంటారు. మేడా ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి సాయంత్రం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి రాజమండ్రికి వెళ్తారు.
ఆర్టీసీ బస్‌లోనే మహిళ ప్రసవించిన ఘటన శుక్రవారం జరిగింది. పీసీపల్లి మండలం ఇర్లపాడుకు చెందిన ప్రయాణికురాలు ‘బెంగళూరు’ నుంచి కనిగిరి బస్‌లో బయల్దేరారు. రాయచోటి సమీపంలోని రామాపురం వద్ద పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో డ్రైవర్ బస్ ఆపారు. వెంటనే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డను 108లో ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్లు బాబు, రసూల్ తెలిపారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
రాజంపేట పట్టణం ఈడిగపాలెంలో ఉంటున్న వీఆర్వో షేక్ ముజీబ్, షేక్ మసుధ బేగం దంపతుల కుమారుడు మహమ్మద్ 18 నెలల వయస్సులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. నవంబర్ 30న అర్హత సాధించగా, డిసెంబర్ 19న ప్రశంసా పత్రం, మెడల్స్ అందుకున్నట్లు తల్లితండ్రులు తెలిపారు. 27 రకాల వెజిటబుల్స్, పండ్లు, జంతువులు, వాహనాలు, సమరయోధులు, శరీర అవయవాలు, నటులు.. ఇలా ఎన్నో గుర్తించినందుకు రికార్డ్స్‌లో ఎక్కాడు.
ఆర్టీసీ పరిధిలోని సమస్యలను పరిష్కరించుటకు అనుగుణంగా శుక్రవారం డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్ ఎం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు ప్రయాణికులు సమస్యలను తెలియజేయవచ్చునని వివరించారు. సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు తెలపవచ్చన్నారు.
కడప జిల్లా పరిధిలోని ముద్దనూరు నుంచి రేణిగుంట వరకు అస్తవ్యస్తంగా ఉన్న జాతీయ రోడ్డును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందించారు. గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించినట్లు గుర్తుచేశారు. కడప- ముద్దునూరు రోడ్డు నాలుగు వరుసల రహదారిగా మార్చాలని కోరారు.
భిన్నంత్వంలో ఏకత్వం కల భారత దేశ గొప్పతనానికి జాతీయ సమైక్యతే కారణమని ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు, రాజంపేట స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ డాక్టర్. పసుపులేటి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని శ్రీ రాజీవగాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులకు జాతీయ సమైక్యత, జీవితం, విలువలు, వృత్తి నైపుణ్యం గురించి ప్రసంగించారు.
కడప యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కళాశాలల అఫ్లియేషన్‌పై ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని నియమించి, విచారణ జరిపించాలని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైవీయూ రిజిస్ట్రార్ పీ.పద్మకు బుధవారం వినతిపత్రం అందజేశారు. అఫ్లియేషన్‌కు అనర్హత కలిగిన కళాశాలకు గుర్తింపు రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భరత్ సింహా, కిషోర్, రవి, ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రిని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. రిమ్స్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రిమ్స్ వైద్య విభాగాధిపతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలోనూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అత్యుత్తమ టీచింగ్ హాస్పిటల్‌గా పేరు గడించిందన్నారు.
Sorry, no posts matched your criteria.