news

News March 13, 2025

రేపు సెలవు.. ఎల్లుండి నుంచి ఒంటిపూట బడులు

image

తెలుగు రాష్ట్రాల్లో ‘హోళీ’ సందర్భంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

News March 13, 2025

వాకింగ్ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోండిలా!

image

వీధికుక్కల దాడి నుంచి సురక్షితంగా ఉండటానికి ఇలా చేయడం మంచిది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాకింగ్ చేయకండి. కుక్కలు లేవని నిర్ధారించుకున్నాకే ఒంటరిగా వాకింగ్ చేయడం ఉత్తమం. తోటి వాకర్స్‌తో రన్నింగ్/వాకింగ్ చేయడం మంచిది. కుక్కలు మీ పళ్లను/ నవ్వును చూసినట్లయితే ఆందోళనకు గురై దాడి చేయొచ్చు. వీధి కుక్కలకు ఒకవేళ ఆహారం పెడితే రెగ్యులర్‌గా పెట్టాలి. లేదంటే అవి మీకు ముప్పు కలిగించవచ్చు.

News March 13, 2025

ఎవరు తలుపు కొడతారోనని భయపడేదాన్ని: హీరోయిన్

image

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సేఫ్టీ విషయంలో చాలా కష్టపడ్డానని బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడు ఎవరు తలుపు కొడతారోనని భయంతో మేకప్ ఆర్టిస్ట్‌ను ఎప్పుడూ సాయంగా ఉంచుకునేదాన్ని. ఇతర హీరోయిన్ల తలుపులు చాలామంది కొట్టి ఉంటారు. నేను అప్పటికే అందాల పోటీ గెలవడం వల్ల, ఫేమస్ కావడంతో అంత త్వరగా ఎవరూ మిస్‌బిహేవ్ చేయలేదు’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

శాసన సభ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే: హరీశ్ రావు

image

TG: ఢిల్లీలో ఉన్నCM రేవంత్ మేరకే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అన్నారు. స్పీకర్‌పై ఏకవచనం వాడలేదని ఒకవేళ వాడి ఉంటే శాసనసభ నియమాల పుస్తకంలో ఏకవచనం వాడటం తప్పుగా చెప్పలేదన్నారు. దళిత కార్డును అడ్డం పెట్టుకొని ప్రభుత్వం రాజకీయం చేస్తుందని …దళిత రాష్ట్రపతి ద్రౌపదీముర్ముని అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు.

News March 13, 2025

HRA క్లెయిమ్ చేయడానికి ఫేక్ రెంటు రిసిప్టులు పెడుతున్నారా..!

image

ఫేక్ రిసిప్టులతో HRA TAX బెనిఫిట్స్ పొందుతున్న వారిని IT శాఖ ఈజీగా గుర్తించి ఆదాయంపై 200% పెనాల్టీ వేస్తోందని నిపుణులు అంటున్నారు. HRA క్లెయిమ్ చేసుకొని సరైన రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుంటే, రెంట్ రిసిప్టుపై యజమాని PAN వివరాలు తప్పుగా ఇస్తే, FORM 16లో కంపెనీ HRA బెనిఫిట్స్ నమోదు చేయకున్నా ఉద్యోగి క్లెయిమ్ చేస్తే, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా పేరెంట్స్, చుట్టాలకు రెంటు ఇచ్చినట్టు చెప్తే దొరకడం ఖాయం.

News March 13, 2025

తెలంగాణ భవన్‌కు హరీశ్‌రావు తరలింపు

image

TG: ట్యాంక్‌బండ్‌ పైనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, జగదీశ్ రెడ్డి తదితరులను పోలీసులు అక్కడికి తరలించారు.

News March 13, 2025

ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

image

AP: రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

News March 13, 2025

చాహల్‌తో డేటింగ్ రూమర్స్: ఆర్జే మహ్వాష్ పోస్ట్ వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ రూమర్స్ వేళ ఆర్జే మహ్వాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను ఈ స్థాయికి రావడం చూసి చిన్ననాటి మహ్వాష్ ఎంతో గర్విస్తోంది. నాకు కావాల్సింది కూడా ఇదే. మనం ఏ తప్పు చేయకుండా, అనవసర విషయాలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి’ అని పోస్టులో రాశారు. డేటింగ్‌పై వస్తున్న రూమర్స్‌పైనే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News March 13, 2025

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

image

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

News March 13, 2025

స్పీకర్‌ను కించపరచలేదు.. ప్రభుత్వాన్ని నిలదీశా: జగదీశ్ రెడ్డి

image

TG: అసెంబ్లీలో తాను స్పీకర్‌ను కించపరచలేదని, ప్రభుత్వాన్ని నిలదీశానని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సభలో అందరికీ సమాన హక్కులుంటాయని మాత్రమే తాను చెప్పినట్లు పేర్కొన్నారు. స్పష్టమైన కారణం లేకుండా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇంకా బలంగా గొంతు వినిపిస్తానని జగదీశ్ స్పష్టం చేశారు.