news

News March 12, 2025

ప్రభాస్‌కు షరతులు వర్తిస్తాయంటున్న డైరెక్టర్!

image

ప్రభాస్ హీరోగా సందీప్ వంగా ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఫౌజీ, ది రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న రెబల్‌స్టార్‌కు ఈ క్రేజీ డైరెక్టర్ పలు షరతులు విధించారని తెలుస్తోంది. స్పిరిట్ లోకేషన్‌లోకి వచ్చాక వేరే సినిమా చేయొద్దని, ఆ లుక్‌లో బయట కనిపించొద్దని కండీషన్స్ పెట్టినట్లు టాక్. వీటికి ప్రభాస్ ఒకే అన్నాడని సమాచారం. మరి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది.

News March 12, 2025

రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయంది. మరోవైపు, ఉపరితల ద్రోణి వల్ల నిన్న TNతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా మేఘాలు ఆవరించి కనిపించాయి.

News March 12, 2025

రూ.2,200 కోట్లు దాటిన విరాళాలు: TTD ఛైర్మన్

image

AP: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ విరాళాలు రూ.2,200 కోట్లు దాటినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. 1985లో నాటి CM ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. నేడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. 9.7 లక్షల దాతలను ఈ ట్రస్ట్ కలిగి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రుచిగా, శుచిగా అన్నప్రసాద వితరణ చేస్తోందని చెప్పారు.

News March 12, 2025

హసీనా ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లు సీజ్!

image

బంగ్లా అల్లర్ల అనంతరం భారత్‌లో తల దాచుకుంటున్న మాజీ PM షేక్ హసీనాకు మరో షాక్ తలిగింది. ఆమె ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ల జప్తుకు ఢాకా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో హసీనా అధికారిక నివాసం ‘సుదాసదన్’తో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఇతర ప్రాపర్టీలను సీజ్ చేయనున్నారు. హసీనా, ఆమె కుమారుడు సాజిద్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ పుతుల్, సోదరి షేక్ రెహానా సహా కుమార్తెల బ్యాంక్ అకౌంట్లను నిలిపివేయనున్నారు.

News March 12, 2025

IMLT20: ఒకే సీజన్‌లో 7 సెంచరీలు

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. ఈ టోర్నీ ప్రారంభమయ్యాక ఈ సీజన్‌లోనే తొలి సెంచరీ నమోదవ్వగా ఇప్పటివరకు ఏడు శతకాలు బాదారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ వాట్సన్ ఒక్కడే మూడు సెంచరీలు చేయగా, విండీస్ ప్లేయర్ సిమ్మన్స్, బెన్ డంక్(AUS), సంగక్కర, తరంగ తలో సెంచరీ చేశారు. ఇంకా నాలుగు మ్యాచులు మిగిలి ఉండగా మరెన్ని సెంచరీలు నమోదవుతాయో చూడాలి.

News March 12, 2025

APPLY: అకౌంట్లలోకి రూ.6,000

image

రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ FEB 24న విడుదల చేశారు.
వెబ్‌సైట్: <>pmkisan.gov.in<<>>

News March 12, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవ్వగా తెలంగాణ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు నామినేషన్లు వేశారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన చేయనుంది.

News March 12, 2025

లిఫ్ట్ ఎక్కుతున్నారా? ఒక్క నిమిషం!

image

ఇళ్లు, ఆఫీస్‌లు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్‌లో నిత్యం లిఫ్ట్‌లు వాడుతుంటాం. కానీ ఎలివేటర్ల నిర్వహణ లోపం వల్ల ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తతో వీటిని నివారించుకోవచ్చు. మీరు బటన్ నొక్కగానే లిఫ్ట్ మీ ఫ్లోర్‌కు వచ్చిందో లేదో ఒక్కసారి చూసుకోండి. ఒక్కోసారి లిఫ్ట్ క్యాబిన్ రాకున్నా డోర్లు తెరుచుకుంటాయి. చూడకుండా అందులోకి ఎక్కాలని చూస్తే కిందపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

News March 12, 2025

ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు

image

ఈ నెల 16న ఢిల్లీలో అంతర్జాతీయ భద్రతా సదస్సు జరగనుంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా 20 దేశాల గూఢచర్య విభాగాల అధినేతలు పాల్గొనే ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. ఉక్రెయిన్-రష్యా, గాజా యుద్ధం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడం వంటి అంశాలపై వీరు చర్చించనున్నారు. ఆస్ట్రేలియా, జర్మనీ, న్యూజిలాండ్ దేశాల ఇంటెలిజెన్స్ చీఫ్‌లు కూడా ఈ సమావేశానికి రానున్నారు.

News March 12, 2025

ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు

image

AP: ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.