India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ తిథి: శుక్ల దశమి, ఉ.10.44 వరకు
☛ నక్షత్రం: పునర్వసు తె.2.05 వరకు
☛ శుభ సమయం: ఉ.8.03-8.39 వరకు
☛ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
☛ యమగండం: మ.12.00-1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
☛ వర్జ్యం: మ.2.25-3.59 వరకు
☛ అమృత ఘడియలు: రా.12.17-1.55 వరకు

☞ AP: రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు
☞ తెలంగాణకు హైదరాబాద్, ఏపీకి CBN: లోకేశ్
☞ TG: ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గిడ్డంగులు: సీఎం రేవంత్
☞ గ్రూప్స్ ఫలితాలు నిలిపివేయండి.. సీఎంకు మందకృష్ణ లేఖ
☞ గుజరాత్ INCలో కొందరు BJPకి పనిచేస్తున్నారు: రాహుల్ గాంధీ
☞ రేపే CT ఫైనల్.. కోహ్లీకి గాయం!
☞ రోహిత్ రిటైర్మెంట్‌పై చర్చ జరగలేదు: గిల్

* నిద్ర పోవడానికి 6 గంటల ముందు వరకు టీ, కాఫీ తాగొద్దు
* రాత్రివేళ ఎక్కువ ఆహారం తినొద్దు
* స్లీపింగ్‌కు ముందు స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు
* నిద్రకు 4 గంటల ముందు వ్యాయామం చేయకూడదు
* స్మార్ట్ ఫోన్, టీవీ స్క్రీన్ చూడటం వల్ల త్వరగా నిద్ర పట్టదు

6 గంటల కంటే తక్కువ నిద్ర పోవడాన్ని తక్కువ నిద్ర అని, 10 గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడాన్ని ఎక్కువ నిద్ర అని అంటారు. ఇవి రెండూ ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. 8 గంటలు నిద్రపోతే అది మంచి నిద్ర. తక్కువ నిద్రతో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అతినిద్రతో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.

WPL-2025: ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 226 పరుగులను ఆర్సీబీ ఛేదించలేకపోయింది. 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో 12 రన్స్ తేడాతో యూపీ గెలిచింది. ఆఖర్లో ఆర్సీబీ గెలుస్తుందనుకున్నా స్నేహ్ ఔట్ కావడంతో ఆ టీమ్ ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ WPL నుంచి నిష్క్రమించింది.

నాగార్జున-జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నటించాలంటే ముద్దులు, రొమాన్స్ సీన్‌లు ఏవీ ఉండకూడదని డైరెక్టర్ లారెన్స్‌కు జ్యోతిక కండీషన్ పెట్టిందట. దీనికి ఓకే చెప్పడంతోనే ఈ మూవీలో నటించిందట. అప్పటికే జ్యోతిక సూర్యతో ప్రేమలో ఉండటంతో ఈ సీన్లకు నో చెప్పిందని టాక్.

తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ‘మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. కేటీఆర్ ‘ఆఖరుకు’ అనే పదం ఎందుకు వాడారని, ఏపీ పెట్టుబడులకు పనికిరాదా?.. ఆ అహంకారం ఏంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ల రేపటి ఢిల్లీ పర్యటన రద్దయింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. రేపు ఉదయం రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్ కుమార్ గౌడ్‌లతో వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

AP: మార్చి 12 నుంచి 15లోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య ఖరారు చేసిన డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని, న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్లేందుకు 7 నెలల సమయం పట్టిందన్నారు. భూములు అమ్మి మాత్రమే రాజధాని నిర్మాణం చేస్తామని, ప్రజల పన్నుల ఆదాయం నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టబోమని స్పష్టం చేశారు.

బ్రిటన్‌లో పాలస్తీనా మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. స్కాట్లాండ్‌లోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ రిసార్ట్‌పై దాడి చేశారు. అక్కడి భవనంపై గ్రాఫిటీ పెయింట్ పూశారు. గ్రౌండ్‌లో ‘గాజా ఈజ్ నాట్ ఫర్ సేల్’ అని రాశారు. అంతకుముందు పాలస్తీనా మద్దతుదారుడు లండన్‌లోని ‘బిగ్ బెన్’ టవర్ ఎక్కి <<15693466>>హల్‌చల్<<>> చేశాడు.
Sorry, no posts matched your criteria.