news

News December 31, 2024

అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దు: పోలీసులు

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు <<15018734>>నాంపల్లి కోర్టును<<>> కోరారు. బన్నీ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. PSలోనూ విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని, ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ విచారణకు సహకరించకపోవచ్చని తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తమ వాదనల్లో పోలీసులు పేర్కొన్నారు.

News December 31, 2024

విమానంలో ఏ సీటు సేఫ్?

image

ఇటీవల తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండటంతో ఫ్లైట్స్‌లో ఏ సీట్లు సేఫ్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెక్కల కిందిభాగంలో ఇంధనం ఉండటం వల్ల నిప్పులు రాజుకుంటే వాటి పక్కన కూర్చున్న వారికి ప్రభావం ఎక్కువని, తోక భాగం సేఫ్ అని నిపుణులు అంటున్నారు. మంటలు లేకపోయినా ముందు కూర్చున్నవారికి ముప్పు ఎక్కువట. మధ్య సీట్ల పరిస్థితి విచిత్రమని, నిప్పు లేకపోతే EMG ఎగ్జిట్ వీరికి దగ్గరగా ఉండటంతో తప్పించుకునే అవకాశముంది.

News December 31, 2024

2024: మీరు మెచ్చిన సినిమా ఏంటి?

image

ఈ ఏడాది మరికొన్ని గంటల్లో ముగియనుంది. 2024లో టాలీవుడ్‌లో 100కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. ‘హనుమాన్’ బంపర్ హిట్‌తో ఏడాది ఘనంగా ప్రారంభమైంది. కల్కి, దేవర, పుష్ప-2, క, టిల్లూ స్క్వేర్, సరిపోదా శనివారం, కమిటీ కుర్రాళ్లు, ఆయ్, 35 చిన్న కథ కాదు వంటి చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తాచాటి ఔరా అనిపించాయి. ఈ ఏడాది వచ్చిన వాటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి?

News December 31, 2024

అఫ్గాన్‌లో మహిళలపై మరింత కఠినమైన ఆంక్షలు

image

అఫ్గాన్‌లో మహిళలపై ఆంక్షల్ని తాలిబన్లు మరింత కఠినతరం చేశారు. మహిళలు ఉండే ప్రాంతాల్లో కనీసం కిటికీలు కూడా ఉండకూడదని హుకుం జారీ చేశారు. ‘ఇళ్లల్లో మహిళలు సమయం గడిపే చోట కిటికీలు ఉండకూడదు. ఇప్పటికే కిటికీలు ఉంటే వాటిని శాశ్వతంగా మూసేయాలి. ఇంటి ఆవరణ, వంటగది, బావులు వంటి ప్రాంతాల్లో వారు బయటకు కనిపించకుండా గోడలు నిర్మించాలి’ అని తేల్చిచెప్పారు. వారి నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News December 31, 2024

నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

image

చెల్లింపుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. RTGS, NEFT, ఆన్‌లైన్ లావాదేవీలు జరిపే వినియోగదారులకు వారు డబ్బులు పంపే బ్యాంకు ఖాతాదారుడి పేరు కనిపించేలా చూడాలని భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్(NPCI)ని ఆదేశించింది. తద్వారా మోసాలు, తప్పులు జరగకుండా వినియోగదారులు జాగ్రత్త పడతారని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1లోపు ఇది అమలుకావాలని బ్యాంకులకు RBI తేల్చిచెప్పింది.

News December 31, 2024

జాగ్రత్త.. రూ.10,000ఫైన్, 6 నెలలు జైలు శిక్ష

image

తెలంగాణలో పోలీసులు ఇవాళ రాత్రి 8 నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే ₹10వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే ₹15వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. డ్రగ్స్ సేవించి దొరికితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. సో.. ఆల్కహాల్ సేవిస్తే డ్రైవ్ చేయకండి.

News December 31, 2024

గాలిపటాలు ఎగరవేసే వారికి రైల్వే సూచనలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే ట్రాకుల వద్ద పతంగులు ఎగురవేయొద్దని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. రైల్వే యార్డులు, గేట్లు, ట్రాకుల వద్ద ఉన్న కరెంట్ తీగలకు సమీపంలో ఎగురవేసి గతంలో చాలా మంది ప్రమాదానికి గురయ్యారని తెలిపారు. అధిక వోల్టేజీతో ఉన్న తీగలకు చైనా మంజా వంటి దారాలు తాకితే ప్రమాదం ఎక్కువని పేర్కొన్నారు. ఎక్కడైనా తీగలకు దారాలు వేలాడితే తమకు సమాచారం ఇవ్వాలంది.

News December 31, 2024

సీఎం రేవంత్ ఆస్తి ఎంతంటే…

image

TG: దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో సీఎం రేవంత్ ఏడో స్థానంలో నిలిచారు. ఆయన పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఇక రూ.931 కోట్లతో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో, రూ.332 కోట్లతో అరుణాచల్ సీఎం పెమాఖండు రెండో స్థానంలో నిలిచారు. కేవలం రూ.15 లక్షల ఆస్తితో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాబితాలో ఆఖరి స్థానంలో ఉన్నారు.

News December 31, 2024

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్

image

దక్షిణ కొరియా అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన యూన్ సుక్‌ను అరెస్టు చేయాలని అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో సైనిక పాలన విధించేందుకు యూన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఆయన్ను విచారించాలని కోర్టు అధికారుల్ని ఆదేశించింది. ఆయన కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News December 31, 2024

మందుబాబులకు గుడ్‌న్యూస్

image

AP: నేడు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. రాత్రి 1గంట వరకు వైన్స్, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు అనుమతి ఇవ్వగా నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి. న్యూఇయర్ సందర్భంగా మద్యం వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు ఓపెన్ ఉండే దుకాణాలు ఒంటి గంట వరకు విక్రయాలు జరపనున్నాయి. బెల్టు షాపుల దోపిడీ అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.