news

News October 21, 2024

48 రన్స్ చేసిన చాహల్.. క్రికెటర్ల ఆశ్చర్యం

image

రంజీ ట్రోఫీలో భారత బౌలర్ చాహల్ 48 రన్స్ చేయడంపై పలువురు క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. హరియాణా తరఫున పదో స్థానంలో వచ్చిన చాహల్.. యూపీపై 152 బంతులాడి 2 రన్స్ తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ‘వాహ్ ఉస్తాద్.. సూపర్ బ్యాటింగ్’ అని రైనా ప్రశంసలు కురిపించారు. ‘ఎన్ని రన్స్ చేశావ్?’ అని బట్లర్ అడగ్గా.. ’48 రన్స్ కొట్టా. నాతో కలిసి ఓపెనింగ్ చెయ్ జోష్ భాయ్’ అని చాహల్ నవ్వులు పూయించారు.

News October 21, 2024

కాంగ్రెస్‌తో సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు: అఖిలేశ్‌

image

UPలో 9 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఉపఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని SP చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ తెలిపారు. అఖిలేశ్ రాజీనామాతో ఖాళీ అయిన క‌ర్హాల్ నుంచి పార్టీ అభ్య‌ర్థి తేజ్ ప్రతాప్ నామినేష‌న్ వేశారు. క‌ర్హాల్ త‌మ‌కు ప‌ట్టున్న స్థానమ‌ని, ప్ర‌జ‌లు చ‌రిత్రాత్మ‌క తీర్పిస్తారని అఖిలేశ్ పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర‌లో సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న స్థానాల‌ను కోరుతామ‌న్నారు.

News October 21, 2024

INDలో మొట్ట మొదటి స్కామ్ ఏంటో తెలుసా?

image

ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో INDకి మరిన్ని జీపులు అవసరమయ్యాయి. అప్పటి బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ VK కృష్ణ మీనన్ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా కొత్తవాటి ధరకే 2వేల సెకండ్ హ్యాండ్ జీపులు ఆర్డరిచ్చారు. ఓ విదేశీ సంస్థతో రూ.80 లక్షల ఒప్పందం చేసుకున్నారు. ఆర్డర్ డెలివరీలో జాప్యం జరగడంతో వచ్చిన వాటిని రక్షణ శాఖ అంగీకరించలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘించడంతో దీనిపై విచారణ జరిపి 1955లో ఈ కేసును క్లోజ్ చేశారు.

News October 21, 2024

US కంటే ఇండియా మార్కెట్ల పనితీరు భేష్: మార్క్ మోబియస్

image

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే వర్ధమాన మార్కెట్లు రెండింతల వృద్ధి రేటు సాధిస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ తెలిపారు. అమెరికా మార్కెట్ల కంటే ఇండియా మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు. ‘భవిష్యత్తులో సెమీకండక్టర్ ప్రొడక్షన్‌లో భారత్ లీడర్‌గా ఎదుగుతుందనే నమ్మకముంది. అనేక పెద్ద సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నాయి’ అని NDTV సమ్మిట్‌లో పేర్కొన్నారు.

News October 21, 2024

కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో గంటలో హైదరాబాద్ నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు. అలాగే భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో వానలు పడుతాయని అంచనా వేశారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

News October 21, 2024

బీఎస్సీ(ఆనర్స్) సీట్ల సంఖ్య పెంపు

image

TG: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ(ఆనర్స్) సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో అదనంగా 200 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ అవసరాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక కోటాలో ఉన్న ఈ కోర్సు ఫీజును రూ.10లక్షల నుంచి రూ.5లక్షలకు తగ్గించింది.

News October 21, 2024

‘ఇసుక’పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: సొంత అవసరాలకు ట్రాక్టర్లతో ఫ్రీగా ఇసుకను తీసుకెళ్లేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని CM చంద్రబాబు చెప్పారు. ఇసుక పాలసీని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్ ప్రక్రియను ప్రైవేట్‌కు అప్పగించడంపై ఆలోచించాలి. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపు కట్టడికి చెన్నై, HYD, BLR మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టాలి’ అని అధికారులను ఆదేశించారు.

News October 21, 2024

ఆ సీన్‌లో చాలా భయపడ్డాను: అనన్య నాగళ్ల

image

‘పొట్టేల్’ సినిమాలో మదర్ రోల్‌లో కనిపించినట్లు హీరోయిన్ అనన్య నాగళ్ల చెప్పారు. తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో తనను కడుపులో తన్నే సీన్ ఉందని, ఆ సన్నివేశంలో నటించేందుకు భయపడ్డానని తెలిపారు. సీనియర్ యాక్టర్ అజయ్ ఇచ్చిన ధైర్యంతో ఆ సీన్ కంఫర్టబుల్‌గా చేసినట్లు చెప్పారు. ఈ సినిమా చూసి తన అమ్మ గర్వంగా ఫీల్ అవుతారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

News October 21, 2024

BREAKING: దీపావళి నుంచి కొత్త పథకం

image

AP: సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు. ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి.

News October 21, 2024

ఎంవీవీ ఇంట్లో డాక్యుమెంట్లు స్వాధీనం: ఈడీ

image

AP: విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవల చేసిన <<14396743>>సోదాలపై<<>> ED స్పందించింది. ‘వృద్ధులు, అనాథల గృహాల కోసం ప్రభుత్వం కేటాయించిన 12.51 ఎకరాల(రూ.200 కోట్లు)ను PMLA నిబంధనలను ఉల్లంఘించి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఆరిలోవ PSలో నమోదైన FIR ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. ఈనెల 19న విశాఖలోని 5 ప్రదేశాల్లో తనిఖీలు చేశాం. కీలక డాక్యుమెంట్లు, డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపింది.

error: Content is protected !!