news

News September 29, 2024

మంత్రి ఉత్తమ్‌‌కు పితృవియోగం

image

TG: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.

News September 29, 2024

లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

image

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఐదుగురు పిటిషన్లు వేశారు. దీనిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని పిటిషనర్లు కోరారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్లు వేశారు.

News September 29, 2024

కొత్త ఫీచర్.. వాట్సాప్ స్టేటస్‌లో పోల్స్

image

వాట్సాప్ ‘పోల్స్ ఫర్ స్టేటస్ అప్ డేట్స్’ అనే ఫీచర్ తీసుకురానుంది. దీనితో యూజర్లు తమ స్టేటస్‌లలో పోల్స్ పెట్టవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేందుకు వీలుంటుంది. ఎవరెవరు పోల్‌లో పాల్గొన్నారు? ఏ ఆప్షన్ ఎంచుకున్నారనేది ఇతరులకు కనిపించదు. పోల్ రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

News September 29, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్లపై BIG UPDATE

image

AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామన్న CM చంద్రబాబు ప్రకటనతో అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న 1.47 కోట్ల మందికి ఏటా 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తే రూ.3500 కోట్లపైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల కిందకు కేంద్రం మారిస్తే APకి కాస్త భారం తగ్గుతుంది.

News September 29, 2024

అమెరికా పెద్ద తప్పు చేసింది: నార్త్ కొరియా

image

ఉక్రెయిన్‌కు 8 బిలియన్ డాలర్ల సైనిక సహాయం ఇవ్వాలని నిర్ణ‌యించి అమెరికా పెద్ద త‌ప్పు చేసింద‌ని నార్త్ కొరియా అభిప్రాయపడింది. ఇది నిప్పుతో చెల‌గాటం లాంటిద‌ని పేర్కొంది. ఉక్రెయిన్ సంఘర్షణను వాషింగ్టన్‌ తీవ్రతరం చేస్తోందని, ఐరోపా మొత్తాన్ని అణుయుద్ధం అంచుకు నడిపిస్తోందని దేశాధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోద‌రి కిమ్ యో జోంగ్ అన్నారు. ర‌ష్యా హెచ్చ‌రిక‌ల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని సూచించారు.

News September 29, 2024

ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం

image

AP: విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్సీకీ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News September 29, 2024

ఆ మాజీ మంత్రి తిరిగి క్యాబినెట్‌లోకి

image

మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని ముఖ్య‌మంత్రి స్టాలిన్ తిరిగి త‌న క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై 15 నెల‌ల‌పాటు జైలులో ఉన్న సెంథిల్ ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. ఇక ఉద‌య‌నిధి స్టాలిన్‌కు DyCMగా ప్ర‌మోష‌న్ ద‌క్కిన విషయం తెలిసిందే. అలాగే క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మరో ముగ్గురి స్థానంలో కొత్త మంత్రులు ఆదివారం మ‌ధ్నాహ్నం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

News September 29, 2024

ఏపీకి 30 ESI ఆస్పత్రులు: పెమ్మసాని

image

APకి 30 ESI ఆస్పత్రులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భూకేటాయింపులు పూర్తైన వెంటనే వీటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ESI ఆస్పత్రి రాబోతోందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సుమారుగా వంద నిర్మాణాలు జరగాల్సి ఉందని, ఆయా శాఖలతో సంప్రదించి పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు.

News September 29, 2024

నటుడి విడాకులకు నేను కారణం కాదు: ఫీమేల్ సింగర్

image

తనతో సంబంధం వల్లే నటుడు జయం రవి ఆయన భార్యకు విడాకులు ఇచ్చారన్న <<14159198>>ప్రచారంపై<<>> సింగర్ కెనీషా మరోసారి స్పందించారు. ‘ఆయనకు నాకు మధ్య శారీరక సంబంధం లేదు. మా మధ్య ఉన్నది కేవలం వ్యాపారపరమైన సంబంధమే. ఆయన నాకు మంచి మిత్రుడు. రవి విడాకుల నిర్ణయానికి నేను కారణం కాదు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు’ అని ఓ ఇంటర్వ్యూలో కోరారు.

News September 29, 2024

అక్టోబర్ 1న DEECET సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 1న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. క్వాలిఫై అయిన వారు సంబంధిత జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు https://deecet.cdse.telangana.gov.inను చూడండి.

error: Content is protected !!