India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు నార్త్ ఇజ్రాయెల్, అటు సౌత్ లెబనాన్‌లో వేలాది మంది నిరాశ్రయులు కావడంతో యూఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై న్యూయార్క్‌లో జరిగిన యూఎన్ఓ సర్వప్రతినిధి సమావేశాల్లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రపంచ దేశాధినేతలతో చర్చించారు. త్వరలోనే కాల్పులకు తెర పడనుందని తెలుస్తోంది.
AP: ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నియామకాల ప్రక్రియ ప్రారంభించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్ డైరెక్టర్లను ఆదేశించింది. అయితే ఈ పోస్టుల భర్తీలో ఒక విధానమంటూ లేకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది.
AP: జనావాసాల్లో ప్రతి కి.మీ పరిధిలో ఒక రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 2,774 షాపులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ షాపులకు 400 నుంచి 450 కార్డులు, పట్టణాల్లో 500 నుంచి 550, నగరాల్లో 600 నుంచి 650 కార్డుల చొప్పున కేటాయించనుందని తెలుస్తోంది. వచ్చే నెల 22 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
జమ్మూకశ్మీర్ రెండోదశ పోలింగులో వలసవెళ్లిన కశ్మీరీ పండితుల్లో 40% ఓటేశారు. వీరికోసం వేర్వేరు ప్రాంతాల్లో 24 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జమ్మూలోని 19 స్టేషన్లలో 40%, ఉధంపూర్‌లో 37%, ఢిల్లీలో 43% ఓటేశారని రిలీఫ్, రిహబిలిటేషన్ కమిషనర్ అరవింద్ కర్వాని తెలిపారు. పురుషులు 3514, మహిళలు 2736 మంది ఓటేశారు. హబాకడల్ నియోజకవర్గంలో 2796 ఓట్లు పోలయ్యాయి. లాల్‌చౌక్‌లో 909, జడిబాల్‌లో 417 ఓట్లు పడ్డాయి.
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను ఇవాళ జనసేనలో చేరనున్నారు. వీరితోపాటు పలువురు నేతలు కూడా పార్టీలో చేరుతారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరిందరికీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కండువా కప్పనున్నారు. కాగా ఇటీవల ఈ ముగ్గురు నేతలు పవన్‌ను కలిసి పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే.
AP: గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేసుకునేవారికి 50% రాయితీ కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కనిష్ఠంగా రూ.20 లక్షల నుంచి రూ.కోటి ఖర్చుతో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. జాతీయ లైవ్‌స్టాక్ మిషన్ కింద యూనిట్ వ్యయంలో 50% రాయితీ వస్తుందన్నారు. 40 శాతం బ్యాంకు రుణం, రైతు 10% వాటా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. గ్రామీణ యువతకు పథకంపై అవగాహన కల్పిస్తామన్నారు.
అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కాలిఫోర్నియాలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరాన్ని కొందరు దుండగలు అపవిత్రం చేశారు. గోడలపై గ్రాఫిటీతో ‘హిందువులు వెళ్లిపోండి’ అని రాశారు. 10 రోజుల క్రితం న్యూయార్క్‌లోని బాప్స్ ఆలయాన్నీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ హేట్ క్రైమ్స్‌ను సంఘటితంగా ఎదుర్కొంటామని హిందూ సంఘాలు తెలిపాయి. అమెరికా చట్టసభ సభ్యులు కొందరు ఈ దాడుల్ని ఖండించారు.
పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్రం విడుదల చేయనుంది. ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున నగదును జమ చేయనున్నారు. కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల సాయాన్ని మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. రైతులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్, ఈకేవైసీ పూర్తి అయ్యాయో లేదో తప్పక చెక్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: <
హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఇటీవల నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు సంప్రదాయం ప్రకారం వేడుకలు జరగాలనేది నా అభిలాష. నా ఫ్యామిలీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తుంది. సన్నిహితుల సమక్షంలో ఆ ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించాలనుకున్నా. నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగిందని అనుకోవట్లేదు. నా వరకు కార్యక్రమం పర్‌ఫెక్ట్‌గా పూర్తయింది’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.