news

News September 25, 2024

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హై

image

ప‌వ‌ర్, ఫైనాన్స్ రంగ షేర్లు బూస్ట్ ఇవ్వ‌డంతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధ‌వారం జీవిత‌కాల గ‌రిష్ఠాల‌కు చేరుకున్నాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 85,169కు, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 26,004కు చేరుకున్నాయి. బలమైన లిక్విడిటీ కారణంగా మార్కెట్‌లో బుల్ జోరు కొన‌సాగుతోంద‌ని, మార్కెట్లు మ‌రింత‌గా విస్త‌రించ‌వ‌చ్చ‌ని, సెన్సెక్స్‌ త్వ‌ర‌లో ల‌క్ష‌కు చేరుకోవ‌చ్చ‌ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News September 25, 2024

ఈ నెల 28న తిరుమలకు కాలినడకన జగన్

image

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలి నడకన తిరుమలకు చేరుకుని పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు పార్టీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

News September 25, 2024

అత్యాచార కేసు.. హర్షసాయి లాయర్ ఏమన్నారంటే?

image

యూట్యూబర్ హర్షసాయిపై నమోదైన అత్యాచార కేసులో ఆయన తరఫు న్యాయవాది కీలక విషయాలు వెల్లడించారు. హర్షసాయి సక్సెస్‌ను చూడలేకనే ఆయనపై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. వారిద్దరి మధ్య ప్రేమ, పెళ్లి లేదని చెప్పారు. ఏడాదిగా వీరిద్దరూ కలవలేదన్నారు. అతని ఎదుగుదల చూడలేకనే నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. హర్ష నటించిన ‘మెగాలోడాన్’ టీజర్‌కు వచ్చిన స్పందనతో ఆమె బ్లాక్‌మెయిల్ చర్యలకు దిగారని తెలిపారు.

News September 25, 2024

జియోగ్రిడ్ల తయారీకి IIT HYD, ఇండోర్ శ్రీకారం

image

తాజ్ మహల్ నిర్మాణ శైలి, భారతీయ నక్షత్ర తాబేలుపై కనిపించే నమూనాల నుంచి ప్రేరణ పొంది జియోగ్రిడ్‌ల త‌యారీకి IIT ఇండోర్ – IIT HYD చేతులు కలిపాయి. జియోగ్రిడ్‌లు మ‌ట్టిలో స్థిరత్వం, లోడ్ బేరింగ్ సామ‌ర్థ్యం పెంపునకు ఉప‌క‌రిస్తాయి. నేల కోత – కొండచరియలు విరిగిపడకుండా నిరోధించడానికి, రోడ్లు, వంతెనల నిర్మాణాలకు స్థిరమైన పునాదిని అందించడానికి ఇందులో జియో సింథటిక్ పదార్థాలను ఉప‌యోగిస్తారు.

News September 25, 2024

ధృవ్‌తో RX100 డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమా!

image

‘మంగళవారం’, ‘RX100’ సినిమాల విజయాలతో ఊపు మీదున్న డైరెక్టర్ అజయ్ భూపతి భారీ బడ్జెట్ సినిమా తీయనున్నారు. తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్‌తో మూవీ తీయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తెలుగు& తమిళ భాషల్లో విడుదలవనుందని వెల్లడించాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు పేర్కొన్నాయి.

News September 25, 2024

ఆ అవ్వకు ‘ఆసరా‘ అందింది!

image

పెన్షన్ తీసుకునేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు పాతూరి దేహ్రి <<14181598>>పాకుతూ<<>> పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన వీడియో వైరలవడంతో ఒడిశాలోని కియోంజర్‌ జిల్లా యంత్రాంగం స్పందించింది. వృద్ధాప్య పింఛనును ఆమె ఇంటి వద్దకే తీసుకువచ్చి అధికారులు అందించారు. దీంతోపాటు ఆమెకు వీల్ ఛైర్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇలా ఎంతో మంది వృద్ధులు ఉన్నారని, వారికి ఇంటికే పెన్షన్ పంపించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

News September 25, 2024

నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్.. పవన్‌ను ఉద్దేశించేనా?

image

‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో’ అని నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిందేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘లడ్డూ మ్యాటర్ సెన్సిటివ్ టాపిక్’ అంటూ తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై పవన్ నిన్న ఫైరయ్యారు. దీంతో కార్తీ వెంటనే క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

News September 25, 2024

పని ఒత్తిడితో మరో యువతి మృతి!

image

పని ఒత్తిడితో యువ సీఏ చనిపోయిన ఘటన మరువకముందే లక్నోలో మరో యువతి ఆఫీసులోనే కుప్పకూలింది. లక్నోలోని HDFC బ్యాంకులో పనిచేస్తోన్న ఫాతిమా కూర్చున్నచోటే పడిపోయి చనిపోయారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. పని ఒత్తిడి వల్లే హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరిగిందని SP అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు

News September 25, 2024

‘హైడ్రా’ వల్ల ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదు: మల్లారెడ్డి

image

TG: రాష్ట్రంలో ‘హైడ్రా’ కారణంగా ఎవరూ ప్రశాంతంగా నిద్ర పోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. అందరిలాగే తనకూ హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయని, తన కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవేనని తెలిపారు. ఇళ్లను కూల్చి ప్రజలను రోడ్డు మీద పడేయడం అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలు అని, ఒక్కో మంత్రి ఒక్కో గ్రూపును తయారు చేశారని విమర్శించారు.

News September 25, 2024

ట్రోల్స్‌పై మనూ భాకర్ కౌంటర్

image

ఎక్కడికెళ్లినా ఒలింపిక్ మెడల్స్ తీసుకెళ్తున్నారని భారత షూటర్ మనూ భాకర్‌పై నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. వీటికి తాజాగా ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘పారిస్ 2024 ఒలింపిక్స్‌లో నేను సాధించిన రెండు కాంస్య పతకాలు భారత్‌కే చెందుతాయి. ఏదైనా ఈవెంట్‌కు నన్ను పిలిచి, ఈ పతకాలను చూపించమని అడిగితే నేను గర్వంగా చూపిస్తుంటాను. నిర్వాహకులు కూడా మెడల్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంటారు’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!