India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒకే నెలలో 2సార్లు పౌర్ణమి వస్తే 2వది బ్లూ మూన్. సీజన్‌లో 4 పౌర్ణమిలు వస్తే 3వ పౌర్ణమినీ బ్లూమూన్ అంటారు. కొన్ని దేశాల్లో స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అని 4 సీజన్లుంటాయి. ఒకే సీజన్లో వస్తున్న నాలుగు పౌర్ణమిలలో 3వది. అటు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. ఈరోజు రెండూ కలిసి ఒకేసారి ఏర్పడుతుండటంతో దీన్ని బ్లూ సూపర్ మూన్ అంటారు. అయితే ఇది బ్లూ కలర్‌లో ఉండదు.
AP: ప్రకాశం జిల్లాకు జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టట్లేదని వైసీపీ చీఫ్ జగన్ విమర్శించారు. ‘కరోనా కష్టకాలంలోనూ మేం 2021లో ప్రాజెక్టు టన్నెల్-1, 2024లో టన్నెల్-2 పూర్తి చేశాం. ఇంకా R&R(రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్)కు రూ.1,200 కోట్లు చెల్లిస్తే నీరు నిల్వ చేయొచ్చు. దీనిపై సీఎం చంద్రబాబు ఆలోచించాలి’ అని Xలో డిమాండ్ చేశారు.
జమ్మూకశ్మీర్‌లోని దాదులో జరిగిన ఉగ్రదాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను వీరమరణం పొందారు. ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్‌లోని దాదు ప్రాంతంలో సైనికులు పెట్రోలింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు మృతి చెందారు.
AP: రాష్ట్రంలో త్వరలోనే ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నామని ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో భేటీలో మంత్రి లోకేశ్ తెలిపారు. ఫాక్స్‌కాన్ మెగాసిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇందులో ఫాక్స్‌కాన్ ప్రధాన భూమిక పోషించాలని, ఎలాంటి సహాయం కావాలన్నా తానే స్వయంగా రంగంలోకి దిగుతానని లోకేశ్ హామీ ఇచ్చారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
AP: ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందని CM చంద్రబాబు చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇకపై రాష్ట్రంలో కరవు అనే మాట వినిపించకూడదన్నారు. ప్రస్తుతం 70 శాతం ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, వాటిని రైతులకు అందిస్తే బంగారు పంటలు పండిస్తారని పేర్కొన్నారు.
AP: అనకాపల్లి(D) కైలాసపట్నంలో కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు <<13890531>>చనిపోయిన<<>> ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
<<13891437>>కోల్‌కతాలో<<>> హత్యాచారానికి గురైన తన కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వెంటనే దహనం చేయడాన్ని బాధితురాలి తండ్రి ప్రశ్నించారు. సాక్ష్యాలను నాశనం చేసే అవకాశంపై సందేహాలను లేవనెత్తారు. శ్మశానవాటికలో దహనానికి మూడు మృతదేహాలు ఉన్నా తమ కుమార్తె మృతదేహాన్ని ముందుగా దహనం చేశారన్నారు.
AP: శ్రీసిటీలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం చేసినట్లు CM చంద్రబాబు చెప్పారు. ‘ఇవాళ ₹1,570 కోట్ల పెట్టుబడితో 15 ప్రాజెక్టులను ప్రారంభించా. ₹900 కోట్ల విలువైన 7 కంపెనీలకు శంకుస్థాపన చేశా. ₹1,213 కోట్ల పెట్టుబడి కోసం 5 సంస్థలు MOUలపై సంతకాలు చేశాయి. 15,280 ఉద్యోగాలు రాబోతున్నాయి. స్వర్ణాంధ్ర-2047 కోసం పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చడానికి కట్టుబడి ఉన్నా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.