news

News December 22, 2024

బుమ్రా కెప్టెన్సీ అద్భుతం: బోర్డర్

image

పెర్త్ టెస్టులో బుమ్రా కచ్చితమైన ఫీల్డింగ్ సెట్ చేశాడని, కెప్టెన్సీ అద్భుతమని ఆసీస్ లెజెండరీ క్రికెటర్ అలెన్ బోర్డర్ కొనియాడారు. బుమ్రాను ఎవరూ తప్పుపట్టలేరన్నారు. అతని బౌలింగ్ అసాధారణంగా ఉందని చెప్పారు. 3 టెస్టుల్లో 21 వికెట్లు తీశాడని గుర్తు చేశారు. బుమ్రా బౌలింగ్ టెక్నిక్ అతని విజయంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కాగా ఆసీస్, భారత్ మధ్య నాలుగో టెస్టు ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానుంది.

News December 22, 2024

English Learning: Antonyms

image

✒ Concur× Differ, disagree
✒ Consolidate× Separate, Weaken
✒ Consequence× Origin, Start
✒ Contempt× Regard, Praise
✒ Conspicuous× Concealed, hidden
✒ Contrary× Similar, Alike
✒ Contradict× Approve, Confirm
✒ Callous× Kind, merciful
✒ Calm× Stormy, turbulent

News December 22, 2024

ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి

image

AP: రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. మధుమూర్తి ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ నీట్ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ఉన్నారు. గుంటూరు(D) జాగర్ల‌మూడికి చెందిన ఈయన విశాఖ‌లో విద్య‌న‌భ్య‌సించారు. వైసీపీ హయాంలో విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా పనిచేసిన హేమ‌చంద్రారెడ్డి జూన్‌లో రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

News December 22, 2024

ISRO-ESA మధ్య కీలక ఒప్పందం

image

వ్యోమగాములకు శిక్షణ, పరిశోధనలపై సహకరించుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై ఇస్రో చీఫ్ సోమనాథ్, ESA డైరెక్టర్ జోసెఫ్ సంతకాలు చేశారు. ISSలో సౌకర్యాల వినియోగం, మానవ అంతరిక్ష పరిశోధన, బయో మెడికల్ ప్రయోగాలు, విద్యపై కలిసి పనిచేస్తాయి. Axiom-4 మిషన్‌లో ఇస్రో గగన్‌యాత్రి, ESA వ్యోమగాములు క్రూ మెంబర్లుగా ఉండనున్నారు.

News December 22, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

కూరిమిగల దినములలో
నేరములెన్నడును గలుగనేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండ నిక్కము సుమతీ!
తాత్పర్యం: స్నేహం బాగా ఉన్న రోజులలో మిత్రులకు ఒకరు చేసిన పనులలో మరొకరికి తప్పులు కనిపించవు. అదే స్నేహితులకు విరోధం వచ్చినపుడు ఒకరి చేష్టలు మరొకరికి దోషములుగా కనిపిస్తాయి.

News December 22, 2024

అమిత్ షాను పిచ్చి కుక్క కరిచింది: ప్రియాంక్

image

అంబేడ్కర్‌పై వివాదాస్పద <<14915470>>వ్యాఖ్యలు<<>> చేసిన అమిత్ షాపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆయనను పిచ్చి కుక్క కరవడంతోనే ఇలా మాట్లాడారని దుయ్యబట్టారు. ‘7 జన్మల్లో భగవంతుడిని జపిస్తే స్వర్గంలో స్థానం లభిస్తుందో లేదో తెలియదు. కానీ ఈ జన్మలో అంబేడ్కర్‌ను స్మరిస్తే రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం పొందుతాం. అంబేడ్కర్, సమానత్వం అనేవి షా ఆలోచనల్లో లేకపోవడమే అసలు సమస్య’ అని పేర్కొన్నారు.

News December 22, 2024

నా ట్రస్ట్ ద్వారా స్కూల్‌ను అభివృద్ధి చేస్తా: పవన్

image

AP: అల్లూరి జిల్లా అనంతగిరి (M) కొర్రపత్తిలో స్కూల్‌ను పవన్ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తానని డిప్యూటీ CM పవన్ అన్నారు. బల్లగరువులో రోడ్ల పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన కొర్రపత్తిలోని స్కూల్‌‌‌కు వెళ్లి చిన్నారులు, సిబ్బందితో మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల స్లాబ్, ప్రహరీ తదితర పనులను తన ట్రస్ట్ ద్వారా చేయిస్తానన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.

News December 22, 2024

డిసెంబర్ 22: చరిత్రలో ఈ రోజు

image

✒ 1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం
✒ 1899: ప్రముఖ వైద్యుడు శొంఠి దక్షిణామూర్తి జననం
✒ 1920: మ్యూజిక్ డైరెక్టర్ తాతినేని చలపతిరావు జననం
✒ 1953: సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పాటు
✒ 2000: ఢిల్లీలోని ఎర్రకోటలోనికి ప్రవేశించిన లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒకపౌరుని హతమార్చారు.
✒ 2015: నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ మరణం
✒ జాతీయ గణిత దినోత్సవం

News December 22, 2024

బన్నీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

image

పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు పోలీసుల అనుమతితోనే థియేటర్‌కు వెళ్లానన్న అల్లు అర్జున్ <<14946141>>వ్యాఖ్యలపై<<>> మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసన్నారు. రోడ్ షో విషయం వీడియోలు చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఇండస్ట్రీ పెద్దలు పరామర్శించి ఉండాల్సిందని సీఎం రేవంత్ చెప్పారన్నారు.

News December 22, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.