news

News February 17, 2025

సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ: స్వామి

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News February 17, 2025

‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.

News February 17, 2025

బీసీసీఐ షరతులతో ఇబ్బందిపడుతున్న కోహ్లీ!

image

బీసీసీఐ టీమ్ఇండియాకు పెట్టిన షరతులు కోహ్లీకి ఇబ్బందికరంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఫ్యామిలీ, వ్యక్తిగత సిబ్బందికి బోర్డ్‌ నో చెప్పింది. దీంతో కోహ్లీ తన చెఫ్‌ను వెంట తీసుకెళ్లలేకపోయారు. డైట్ విషయంలో చాలా కఠినంగా ఉండే విరాట్‌కి అక్కడి ఫుడ్ తినటం ఇబ్బందిగా మారిందట. దీంతో మేనేజర్‌తో తనకు కావాల్సిన ఆహారాన్ని ఓ ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి తెప్పించుకొని తింటున్నారని సమాచారం.

News February 17, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: CM రేవంత్

image

TG: ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

News February 17, 2025

PAK Links: పాకిస్థానీపై FIR నమోదు

image

పాకిస్థాన్ పౌరుడు అలీ తాఖీర్ షేక్‌పై అస్సాంలో FIR నమోదైంది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ భార్య ఎలిజబెత్‌తో అతడు కాంటాక్టులో ఉన్నాడని సమాచారం. ఢిల్లీ అల్లర్లపై గౌరవ్ ఇచ్చిన స్పీచ్‌కు అతడు సంబరపడ్డాడని తెలిసింది. గౌరవ్, ఎలిజబెత్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలపై అస్సాం క్యాబినెట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే పని మొదలు పెట్టిన సీఐడీ నేడు ఒకరిపై FIR నమోదు చేయడం గమనార్హం.

News February 17, 2025

GBS కలకలం.. సీఎం సమీక్ష

image

APలో GBS <<15485860>>కేసులు <<>>భారీగా పెరుగుతుండటంపై ఆందోళన నెలకొంది. దీంతో గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధిపై తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి సత్యకుమార్, అధికారులతో కలిసి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు.

News February 17, 2025

FEB 20న 4:30PMకి ఢిల్లీ సీఎం ప్రమాణం!

image

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. గురువారం సాయంత్రం 4:30కు ప్రధాని మోదీ, HM అమిత్ షా, కేంద్ర మంత్రుల సమక్షంలో రామ్‌లీలా మైదానంలో ఈ వేడుక జరగనుందని సమాచారం. మంత్రివర్గమూ అదే రోజు ప్రమాణం చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా, ఆశీశ్ సూద్ ముందు వరుసలో ఉన్నారు.

News February 17, 2025

2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు

image

ప్రపంచ జనాభా అంచనాలపై ఐరాస నివేదిక విడుదల చేసింది. 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లకు చేరుతుందని, 2100 నాటికి 150 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. మరోవైపు 2061 నాటికి చైనా జనాభా 120 కోట్లకు తగ్గుతుందని, 2100 నాటికి 63 కోట్లకు పరిమితం అవుతుందని నివేదికలో వెల్లడించింది.

News February 17, 2025

పుష్ప నటుడి పెళ్లి ఫొటోలు

image

‘పుష్ప’ నటుడు ధనంజయ(జాలి రెడ్డి) తన ప్రేయసి డాక్టర్ ధన్యతను పెళ్లి చేసుకున్నారు. నిన్న తెల్లవారుజామున వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్నిహితుల సమక్షంలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలకు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, తెలుగు దర్శకుడు సుకుమార్ తదితరులు హాజరయ్యారు.

News February 17, 2025

ఐదేళ్ల పాలనలో జగన్ ఆర్థిక విధ్వంసం: లోకేశ్

image

AP: రాష్ట్రంలో YCP ఐదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రులందరూ కలిపి 58 ఏళ్ల పాటు చేసిన అప్పుపై రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా జగన్ పాలన ముగిసే నాటికి రూ.24,944 కోట్లకు చేరిందని తెలిపారు. 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ చేసిన అప్పుపై చెల్లించే వడ్డీనే రూ.11 వేల కోట్లు అధికమన్నారు.