news

News February 17, 2025

శక్తిమంతంగా ఉంటేనే లక్ష్యాన్ని సాధిస్తాం: మేరీకోమ్

image

ఏ లక్ష్యమైన సాధించాలంటే దానికి మానసికంగా, శారీరకంగా శక్తిమంతంగా ఉండాలని బాక్సర్ మేరికోమ్ అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థుల సందేహాలకు సమాధానమిచ్చారు. ఒకరు సాధించిన విజయాన్ని మనమెందుకు చేరుకోలేమని అన్నారు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ధైర్యంతోవాటిని ఎదుర్కొన్నానని తెలిపారు. మేరీకోమ్‌తో పాటు పారా ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ సుహాస్ యతిరాజ్ పాల్గొన్నారు

News February 17, 2025

‘తుని’లో అమీతుమీ

image

AP: ఇవాళ తుని మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్-2 ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. TDP-YCP శ్రేణులు రోడ్లపైకి రావడంతో గందరగోళం నెలకొంది. 2021 ఎన్నికల్లో 30 వార్డులను YCP క్లీన్‌స్వీప్ చేసింది. ఇటీవల 10మంది సభ్యులను చేర్చుకున్న TDP.. MLA దివ్య ఓటు సాయంతో పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అలాగే పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్, పాలకొండ మున్సిపల్ ఛైర్మన్ పదవులకూ నేడు ఎన్నిక జరగాల్సి ఉంది.

News February 17, 2025

రేపు వంశీని పరామర్శించనున్న జగన్

image

AP: కిడ్నాప్, దాడి వ్యవహారంలో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు రానున్నారు. అనంతరం నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇవ్వనున్నారు.

News February 17, 2025

అయ్యో బంగారు తల్లీ!

image

ఆ బంగారు తల్లి పదో తరగతి చదువుతోంది. ఎవడో కామాంధుడి అకృత్యానికి గర్భం దాల్చింది. కూలిపనులు చేసుకునే ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. తీరా 9 నెలలూ గడిచేసరికి ఆమెకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ వయసులో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె శరీరం సహకరించలేదు. దీంతో ఆ బంగారుతల్లి ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

News February 17, 2025

FAT TO FIT: 42 రోజుల్లో 25 కేజీలు తగ్గిన డాక్టర్

image

చైనాకు చెందిన వు టియాంజెన్(31) అనే డాక్టర్ ఫిట్‌నెస్ జర్నీ వైరలవుతోంది. 2023లో 97.5 కేజీల బరువున్న అతను సాధనతో 42 రోజుల్లో 25 కేజీలు తగ్గారు. అథ్లెట్ల తరహాలో బాడీని తీర్చిదిద్దుకున్నారు. IFBB వరల్డ్ ఫిట్ మోడల్ ఛాంపియన్‌షిప్ సహా పలు ఫిట్‌నెస్ పోటీల్లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నారు. రోజూ 2గంటల వ్యాయామం, 6 గంటల నిద్ర, మంచి ఆహారం, క్రమశిక్షణ తన వెయిట్ లాస్‌కు దోహదం చేశాయని అతను చెబుతున్నారు.

News February 17, 2025

వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: BRS ప్రభుత్వం నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్‌రూం ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1(సొంత స్థలం ఉన్నవారు), L2(స్థలం లేనివారు), L3(ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నవారు)గా విభజించిన విషయం తెలిసిందే. L2లో 19.6 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 80వేల మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News February 17, 2025

పాక్ కోసం రహస్య సమాచారంపై పార్లమెంటులో గొగోయ్ ప్రశ్నలు?

image

భార్య ఎలిజబెత్‌కు పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ MP గౌరవ్ గొగోయ్ అడిగిన ప్రశ్నలపై సందేహాలు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఆయన పాక్ దూతను కలిశాక సరిహద్దు, తీర ప్రాంతాలు, అక్కడ మోహరించిన భద్రత, పరికరాలపై డిఫెన్స్ మినిస్ట్రీని ప్రశ్నించారు. అలాగే అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పరికరాలు, అందుబాటులోని యురేనియం, తవ్వకాలపై అడిగారు. దీనిపై అస్సాం Govt దర్యాప్తునకు ఆదేశించింది.

News February 17, 2025

పాక్‌ ISIతో రాహుల్ గాంధీ డిప్యూటీ నేత భార్యకు సంబంధాలు?

image

రాహుల్ గాంధీ అనుచరుడు, డిప్యూటీ LoP గౌరవ్ గొగోయ్, అతడి భార్య ఎలిజబెత్ గొగోయ్‌పై అస్సాం దర్యాప్తునకు ఆదేశించింది. బ్రిటన్ పౌరురాలైన ఆమెకు పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో లీడ్ పాక్ సంస్థకు పనిచేశారు. ISIతోనూ అనుబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దంపతులిద్దరూ దేశద్రోహం చేశారా? అస్సాం సహా దేశవ్యాప్తంగా పాక్ నెట్‌వర్క్‌కు సాయం చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతుందని CM హిమంత తెలిపారు.

News February 17, 2025

కులగణన కోసం మరో అవకాశం: పొన్నం

image

TG:కులగణన వివరాల నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని, ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తాము సిద్ధమన్నారు. కులగణనలో పాల్గొనని వారు ఈ నెల 28 వరకు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. 040-211 11111 నంబర్‌కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆన్‌లైన్‌లోనూ <>https://seeepsurvey.cgg.gov/<<>> ద్వారా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

News February 17, 2025

ఉజ్జయిని క్షేత్ర విశిష్టత మీకు తెలుసా

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ <<15481382>>మూడవది. <<>>పూర్వం ఈ ప్రాంతంలో ఒక శివభక్తుడు ఉండేవారు. అతని కుమారులపై రాక్షస రాజు దాడి చేస్తాడు. అయినా వారు భయపడకుండా శివలింగాన్నిపూజిస్తారు. దీంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై రాక్షసుడిని భస్మం చేస్తాడు. అనంతరం అక్కడే స్వయంభుగా వెలిసినట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రాన్నిదర్శిస్తే అకాల మృత్యుబాధలు ఉండవని భక్తుల నమ్మకం.