India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ నేత కారు డ్రైవర్‌ను తాను దూషిస్తూ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై చింతమనేని సీఎంకు వివరణ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం వంటి పనులతో పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని CM ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని, సహనంతో వ్యవహరించాలని సూచించారు.

TG: ప్రధాని మోదీ కులంపై సీఎం <<15461493>>రేవంత్ చేసిన వ్యాఖ్యలపై<<>> బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇలాగే మాట్లాడి ఇంటికి వెళ్లారని దుయ్యబట్టారు. రేవంత్‌కు కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.

సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఓయ్’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈనెల 26న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంతో పాటు మాస్ మహారాజా రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా కూడా రీరిలీజ్ కానుంది. ఏ సినిమాకు వెళ్తున్నారు? COMMENT

సుమారు 8 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు వచ్చేనెల భూమిపైకి రానున్నారు. అయితే జీరో గ్రావిటీ ఉండే స్పేస్ నుంచి గురుత్వాకర్షణ కలిగిన భూమిపైకి వచ్చాక వారికి అనేక ఇబ్బందులు ఎదురవనున్నాయి. చిన్న పెన్సిల్ ఎత్తినా అది వర్కౌట్‌తో సమానమవుతుందని విల్మోర్ తెలిపారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం చాలా కష్టంగా ఉంటుందని సునీత చెప్పారు.

రోహిత్ శర్మను ఇకపై టెస్టులకు BCCI పరిగణనలోకి తీసుకోకపోవచ్చని PTI వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త WTC సీజన్‌లో బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని, ముందు జాగ్రత్తగానే NCAకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి.

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, MLA కోటా MLC పదవులు సహా మరికొన్ని అంశాలపై ఆయనతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్ రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో ఆయన ఫోన్ కీలకం కావడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అది చేతికి వస్తేనే ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.

సోషల్ మీడియా దిగ్గజం ‘ఇన్‌స్టాగ్రామ్’లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. రెడ్డిట్‌లో అప్‌ఓట్, డౌన్‌ఓట్ ఉన్నట్లు ఇన్‌స్టాలోనూ పోస్టు కింద చేసిన కామెంట్ నచ్చకపోతే డిస్ లైక్ చేసే ఫీచర్ తీసుకొచ్చేందుకు ‘మెటా’ యోచిస్తోంది. యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో లవ్(లైక్) బటన్ మాత్రమే ఉంది.

TG: ‘ఎనిమీ ప్రాపర్టీస్’పై అధికారులతో కేంద్రమంత్రి బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. భారత్ నుంచి వెళ్లి పాక్, చైనాలో స్థిరపడ్డవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. మార్చిలోపు లెక్కలు తేల్చాలన్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఈ ఆస్తులున్నట్లు గుర్తించారు. పాక్, చైనాలో సెటిలైన భారతీయుల ఆస్తులను కేంద్రం ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం కింద స్వాధీనం చేసుకుంటుంది.

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రెపో రేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, రిటైల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గినట్లు తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి ఇది మంచి అవకాశమని పేర్కొంది. ఎంసీఎల్ఆర్, బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.