India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులెవరో తెలుసా? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం రూ.10వేల కోట్ల నికర విలువతో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో కపూర్లు, చోప్రాలకే ఈ ట్యాగ్ ఉండేది. అయితే, ఇప్పుడు అత్యంత ధనవంతులైనప్పటికీ.. భూషన్ కుటుంబం ఒకప్పుడు పండ్లు అమ్ముకునేది. 1970లలో భూషన్ తండ్రి గుల్షన్ కుమార్ సంగీత క్యాసెట్లు విక్రయించే షాపును కొనుగోలు చేయడంతో వీరి రాత మారిపోయింది.
TG: వచ్చే నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ సభల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి రేపు టైటిల్ & టీజర్ విడుదలవనుంది. ఉదయం 10.24 గంటలకే టీజర్ వీడియో రానుండటంతో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘రేపు వచ్చే అదిరిపోయే BGM కోసం సిద్ధంగా ఉండండి. బాలయ్య బాబు సినిమాలకు తమన్ ఎందుకు మ్యూజిక్ అందించాలో మీకే తెలుస్తుంది’ అని చేసిన ట్వీట్ అంచనాలను పెంచేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై నీలినీడలు కమ్ముకున్న సమయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ విధానానికి అంగీకరించకపోతే ఈ టోర్నీ భారత్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ ఆడటానికి భారత్‌కు రాకపోతే శ్రీలంకను క్వాలిఫై చేస్తారని టాక్. ఈ విషయంపై ICC తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా CT పాక్‌లో జరగాల్సి ఉంది. కానీ అక్కడికి వెళ్లేందుకు ఇండియా ససేమిరా అంటోంది.
ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయుల్ని తగ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ కమిషన్ స్టేజ్-3 ప్రణాళికను శుక్రవారం నుంచి అమల్లోకి తేనుంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్, CNG, BS-6 మినహా ఇంటర్ స్టేట్ బస్సులు తిరగడంపై నిషేధం. BS-3 పెట్రోల్, BS- 4 డీజిల్ ఫోర్ వీలర్స్‌పై నిషేధం. ప్రజా రవాణా వాడాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రైమరీ స్కూళ్లను మూసివేసి Online Classes నిర్వహించాలని CM ఆతిశీ ఆదేశించారు.
ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తమ అభిమాన హీరోలు, క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, సచిన్, ధోనీ, గిల్, యువరాజ్, పంత్, బుమ్రాల చైల్డ్‌హుడ్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. నెలల బాబుగా ఉన్న రోహిత్ క్యూట్‌గా ఉన్నారని, మొదటిసారి ఈ ఫొటో చూస్తున్నామని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇందులో మీ అభిమాన క్రికెటర్ ఉన్నారా? కామెంట్ చేయండి.
వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిలబస్ 15% తగ్గింపు సహా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ పరీక్షలను ప్రవేశపెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇండోర్‌లో జరిగిన ఓ సమావేశంలో సిలబస్ తగ్గిస్తున్నట్టు CBSE అధికారులు ప్రకటించారని వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ వార్తల్ని ఖండించింది.
సూర్య నటించిన ‘కంగువా’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.100కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కోలీవుడ్ సినిమాలు 4వారాలకే ఓటీటీలోకి వెళ్తుండగా, అందుకు భిన్నంగా ‘కంగువా’ 6వారాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఇది ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.
అమెరికా ప్రస్తుత, కాబోయే అధ్యక్షులు జో బైడెన్, ట్రంప్ భేటీ కావడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. వారిద్దరూ ప్రపంచ రాజకీయాలు, అమెరికా పాలసీల గురించి చర్చించారు. అగ్రరాజ్యంలోని ఈ సంప్రదాయం బాగుందని, గత ప్రభుత్వ పాలసీలు కొత్త ప్రభుత్వానికి తెలుస్తాయని చెబుతున్నారు. ఇండియాలోనూ ఇలాంటి స్నేహపూర్వక రాజకీయాలు ఉండాలంటున్నారు. మరి మన దేశంలో అలాంటి ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఊహించడమైనా సాధ్యమేనా?
కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఢిల్లీ విలవిలలాడుతోంది. ప్రస్తుతం వాయు నాణ్యత సూచిక (AQI) ప్రమాదకర స్థితిలో 432 వద్ద కొనసాగుతోంది. గాలిలో పొగ పెరగడంతో విజిబిలిటీ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో AQI ఎలా ఉందో తెలుసుకుందాం. చండీగఢ్‌లో 418, లక్నోలో 234, నోయిడాలో 367, గురుగ్రామ్‌లో 309, చురులో 290, కోల్‌కతాలో 162, హైదరాబాద్‌లో 96, చెన్నైలో 44, బెంగళూరులో 49, ముంబైలో 127గా ఉంది.
Sorry, no posts matched your criteria.