India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: గల్లీ లీడర్లే దేశ ప్రధాని స్థాయిలో వీఐపీ ట్రీట్‌మెంట్ కావాలని ఫీలయ్యే రోజులివి. అలాంటిది ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య 5సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా నిరాడంబరంగా జీవిస్తున్నారు. సైకిల్, RTC బస్సులే ఆయనకు ప్రయాణ సాధనాలు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటి పరీక్షల కోసం వెళ్లారు. అందరితో పాటు వేచి చూసి తన వంతు వచ్చాక వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 16వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది. HYD వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది.
ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి బైడెన్‌తో ట్రంప్ <<14604330>>భేటీ<<>> అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ఆసక్తికర చర్చ జరిగింది. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడం నేషనల్ సెక్యూరిటీకి ముఖ్యమని బైడెన్ చెప్పారు. యూరప్ బలంగా, స్థిరంగా ఉంటేనే యుద్ధం నుంచి US దూరంగా ఉండటం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు, యూరప్ అంశాల్లో ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే.
TG: తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని KTR ట్వీట్ చేశారు. ‘రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? 9నెలలుగా రైతులను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో’ అని ఆయన ట్వీట్ చేశారు.
AP: అసెంబ్లీ ప్యానల్ స్పీకర్లుగా పలువురు MLAలకు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు అవకాశం కల్పించారు. వైసీపీ MLA దాసరి సుధ, జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలితకుమారి, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు అవకాశం ఇస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
TG: DAP ధర బస్తాపై ఏకంగా ₹300 పెరగడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50KGల DAP ధర ఇటీవల వరకు ₹1350 ఉండగా, తాజాగా ₹1650కు పెంచారు. పాత స్టాక్‌కు కొత్త ధర వర్తించదని ప్రభుత్వం చెబుతున్నా వ్యాపారులు ₹1650 వసూలు చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు. OCT నుంచి యాసంగి సీజన్ ప్రారంభం కాగా, ఇదే అదనుగా భావించి పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలున్నాయి.
TG: పంట పొలాల్లో సోలార్ పవర్ సృష్టికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చిలోగా 4 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ‘పీఎం కుసుమ్’ అమలుకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా పంటలకు తోడుగా విద్యుత్ ఉత్పత్తితోనూ రైతులు ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం లేదా కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL)లో 261 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాన్ని బట్టి బీఏ, బీకాం, BSC LLB, MSC, PG <
వెబ్‌సైట్: https://gailonline.com/
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 21న హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి NTR స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. 22న హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్‌మంతన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
జీవించి ఉన్నవారిలో 2024కు గాను ‘సెక్సియెస్ట్ మ్యాన్’గా అమెరికా నటుడు, డైరెక్టర్ జాన్ క్రసిన్‌స్కీని ఎంపిక చేసినట్లు పీపుల్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ అవార్డు వస్తుందని ఊహించలేదని, చాలా సంతోషంగా ఉందని జాన్ తెలిపారు. అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ‘జాక్ ర్యాన్’ వెబ్‌సిరీస్‌తో ఆయన ఫేమస్ అయ్యారు. హారర్ చిత్రం ‘ఎ క్వైట్ ప్లేస్’కు డైరెక్టర్, కో రైటర్‌గానూ పనిచేశారు.
Sorry, no posts matched your criteria.