India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందనేది ప్రస్తుతానికి రహస్యం. కానీ అమాయకుల ప్రాణాలు పోకుండా ఆపాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు మంచి ప్రణాళిక ఉంది. వచ్చేవారం ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అవుతా’ అని స్పష్టం చేశారు.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. తన తల్లితో కలిసి ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. షార్ట్ హెయిర్‌తో పూర్తిగా విభిన్నంగా ఉన్నారు. కాగా విజయ్ నటిస్తున్న వీడీ12’(వర్కింగ్ టైటిల్) మూవీ నుంచి ఈ నెల 12న టైటిల్, టీజర్ విడుదల కానున్నాయి.

TG: రాష్ట్రంలో పనుల కోసం వెళ్లిన ఎమ్మెల్యేలను మంత్రులు కమీషన్లు, పర్సంటేజీలు అడుగుతున్నారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘బిల్లు పాస్ కావాలంటే 10% పర్సంటేజ్ అడుగుతున్నారు. భూ సమస్యలు క్లియర్ కావాలంటే 30% పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నారు. మంత్రుల వైఖరి నచ్చకే ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర సంపదంతా ఢిల్లీకి దోచిపెడుతున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యం ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. ఓపెనర్ డకెట్(65), రూట్(69) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3, షమీ, వరుణ్ చక్రవర్తి, హార్దిక్, హర్షిత్ తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 50 ఓవర్లలో 305.

TG: పంచాయితీ పెట్టి పరువు తీసిందనే కోపంతోనే గురుమూర్తి తన భార్యను హతమార్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. ఎలాగైనా భార్య అడ్డు తొలగించుకోవాలని JAN 15న పిల్లలను చెల్లెలి ఇంటి దగ్గర వదిలాడు. 16న భార్య గొంతు నులిమి చంపి, డెడ్ బాడీని ముక్కలుగా చేసి హీటర్‌తో ఉడికించాడు. మిగిలిన ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో పడేశాడు. గురుమూర్తికి అతడి చెల్లెలు, తల్లి, తమ్ముడు సహకరించినట్లు తెలుస్తోంది.

TG: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు ఇంత వివక్ష అని కేరళలోని ఓ సభలో ప్రశ్నించారు. ఈ రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రమాదకరమని, దక్షిణాది ప్రజలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఒకే వ్యక్తి-ఒకే పార్టీ అనేది మోదీ రహస్య విధానమన్నారు.

హమాస్‌తో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా నుంచి తమ బలగాల ఉపసంహరణను ప్రారంభించామని ఇజ్రాయెల్ తెలిపింది. ప్రస్తుతం నెట్‌జరీమ్ కారిడార్ నుంచి సైనిక ఉపసంహరణ జరుగుతోందని పేర్కొంది. మొత్తం 42 రోజుల పాటు ఈ సీజ్‌ఫైర్ అమల్లో ఉండనుంది. అటు హమాస్ మరింతమంది ఇజ్రాయెల్ పౌరుల్ని విడుదల చేస్తే ఇటు ఇజ్రాయెల్ మరింత సైన్యాన్ని తరలించి సీజ్‌ఫైర్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడితే మాజీ సీఎం, ఆ పార్టీ నేత ఆతిశీ <<15403368>>డాన్స్<<>> చేయడం సిగ్గుచేటని ఎంపీ స్వాతి మాలీవాల్ ట్వీట్ చేశారు. సీనియర్ నేతలంతా పరాజయం పాలైతే ఆతిశీ మాత్రం తనకేమీ పట్టనట్లు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. పార్టీ ఓటమిపై కేజ్రీవాల్ కుమిలిపోతుంటే ఆమెకు మాత్రం ఎలాంటి బాధ లేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఆమె సిగ్గు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అసెంబ్లీ సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం లేకనే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయని శివసేన(UBT) ఎంపీ సంజయ్‌రౌత్ అన్నారు. కలిసి పోటీచేస్తే ఫలితం వేరేలా ఉండేదన్నారు. ఇండియా కూటమిలో అంతర్గత కలహాలు బీజేపీకి లాభం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని చెప్పారు. ఇండియా అలయెన్స్ ప్రస్తుతం ఉందని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలిపారు.

AP: రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చడంలో CM చంద్రబాబు ఊసరవెల్లినే మించిపోయారని YCP నేత కన్నబాబు ఎద్దేవా చేశారు. మోదీ డిక్టేటర్ అంటూ గతంలో తిట్టిన చంద్రబాబు ఇప్పుడు రైట్ లీడర్ అంటూ పొగడడం దారుణమన్నారు. ‘కేజ్రీవాల్ ఓడిపోగానే బాబు కొత్త రాగం అందుకున్నారు. గతంలో మోదీ హఠావో.. దేశ్ బచావో అంటూ విమర్శించారు. పీఎంపై చేసిన వ్యాఖ్యలన్నీ రికార్డు అయ్యాయి. ప్రజలు అంత సులువుగా మర్చిపోరు’ అని ఫైర్ అయ్యారు.
Sorry, no posts matched your criteria.