news

News December 13, 2024

BREAKING: RBI హెడ్ క్వార్టర్స్‌కు బాంబు బెదిరింపులు

image

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు కూడా ఇవాళ వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటన్నింటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 13, 2024

నేడు భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరం దాటింది. కాగా, ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొంది. అటు, అల్పపీడనం తీరం దాటిన సందర్భంగా TNలో భారీ వర్షాలు పడుతున్నాయి.

News December 13, 2024

స్టాక్ మార్కెట్లు విలవిల.. RS 2.5L CR నష్టం

image

స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 24,389 (-156), సెన్సెక్స్ 80,742 (-540) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.2.5లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT, ఫార్మా, మెటల్, కమోడిటీస్, ఎనర్జీ రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. టాటా స్టీల్, JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, INDUSIND టాప్ లూజర్స్. AIRTEL, ADANIENT టాప్ గెయినర్స్.

News December 13, 2024

పింఛన్‌తో బతుకీడుస్తున్న భారత మాజీ క్రికెటర్

image

తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్, సచిన్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ తెలిపారు. తనకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తో కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారు. ‘యూరిన్ సమస్యతో బాధపడుతున్నా. నా కుటుంబం సాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. గతంలో రెండు సర్జరీలకు సచిన్ సహాయం చేశారు. కపిల్ దేవ్ ఆఫర్ మేరకు నేను రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు సిద్ధం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News December 13, 2024

నేడు ఫ్రాన్స్ ప్రధానిని ప్రకటించనున్న మేక్రాన్

image

ఫ్రాన్స్‌కు తదుపరి ప్రధానిని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ నేడు ప్రకటించనున్నారు. 48 గంటల్లో కొత్త ప్రధానిపై ప్రకటన ఉంటుందని రెండు రోజుల క్రితం ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంలో గత ప్రధాని మైకేల్ బార్నియర్ ఓడిపోవడంతో ఆయన గత వారం తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఆ దేశంలో ఆరు నెలల్లో ఇది రెండో సంక్షోభం కావడం గమనార్హం.

News December 13, 2024

కళకళలాడనున్న లోక్‌సభ.. ఎందుకంటే?

image

శీతకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభ సరిగ్గా జరిగిందే లేదు. ‘మోదీ, అదానీ ఏక్ హై’ అంటూ కాంగ్రెస్, ‘సొరోస్, రాహుల్ ఏక్ హై’, సొరోస్‌తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ BJP విమర్శించుకుంటున్నాయి. వజ్రోత్సవాల సందర్భంగా నేడు, రేపూ లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ జరగనుంది. దీనికి అన్ని పార్టీల ఎంపీలు హాజరవుతున్నారు. చాన్నాళ్ల తర్వాత సభ నిండుగా కళకళలాడనుంది. అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఆస్కారం కనిపిస్తోంది.

News December 13, 2024

ఘోరం: నిద్రలేపిందని తల్లిని చంపేసిన బాలుడు!

image

కాలేజీకి వెళ్లమంటూ నిద్రలేపిన తల్లిని ఇంటర్ చదువుతున్న బాలుడు ఆగ్రహంతో తోసేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై మృతిచెందారు. UPలోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. హత్య అనంతరం ఇంటికి తాళం వేసి నిందితుడు పరారయ్యాడు. చెన్నైలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న అతడి తండ్రి భార్య ఫోన్ తీయడం లేదని ఇంటికి వచ్చి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. పోలీసుల విచారణలో కొడుకే నిందితుడని తేలింది.

News December 13, 2024

మార్చి 3 నుంచి TG ఇంటర్ పరీక్షలు?

image

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 3 నుంచి ప్రారంభించాలని భావిస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని చూస్తోంది. త్వరలోనే ఇంటర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ షెడ్యూల్ ప్రకటించనుంది. మరోవైపు ఇప్పటికే ఏపీలో <<14851951>>ఇంటర్<<>>, <<14851568>>టెన్త్<<>> షెడ్యూల్ విడుదలైంది.

News December 13, 2024

క్షమాపణలు చెప్పిన మోహన్‌ బాబు

image

మీడియాపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు TV9కి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ‘నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నాను. ఘటన అనంతరం 48 గంటల పాటు ఆస్పత్రిపాలు కావడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, టీవీ9కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నారు.

News December 13, 2024

అత్యుత్తమ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ

image

హైదరాబాద్ బిర్యానీ మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ వంటకాల్లో బిర్యానీ 31వ స్థానం దక్కించుకుంది. మొత్తం 15,478 వంటకాలు ఈ పోటీలో నిలవగా బిర్యానీ ఈ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కొలంబియాకు చెందిన లెచోనా వంటకం అగ్రస్థానం దక్కించుకుంది. దక్షిణ భారత వంటకాలను రుచి చూపించే రెస్టారెంట్లలో ITC కోహినూర్ మూడో స్థానంలో ఉంది.