India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కూటమి ప్రభుత్వం అర్ధ సంవత్సర పాలన అర్థ రహితమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. ఆరు నెలల పాలనలో సూపర్ 6 హామీల అమలుకు దిక్కులేదని విమర్శించారు. టీడీపీ తొలి ఐదేళ్ల పాలనలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, ఇప్పుడు అదే చేతిలో కైలాసం చూపిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ ముగిసిందని, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
APలో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 PMT/PET పరీక్షలపై పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అభ్యర్థులు కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి.
రికార్డులనేవి తాత్కాలికమేనని, వాటికన్నా తనకు అభిమానుల ప్రేమే ముఖ్యమని హీరో అల్లు అర్జున్ అన్నారు. రికార్డులన్నాక బ్రేక్ అవ్వాల్సిందేనని తాను చెప్తానని, ఇంకో 2-3 నెలల్లో కొత్తవి నమోదు కావచ్చని చెప్పారు. సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ అనేది ముఖ్యం కాదని దేశం ఎదుగుతోందని పేర్కొన్నారు. ‘పుష్ప-2’ విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 21న USAలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నట్లు మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2025, జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
AUSతో జరిగే మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో ఆయన దారుణంగా విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెట్స్‌లో ఆయన కొత్త బంతులతోనే ప్రాక్టీస్ చేయడం గమనార్హం. రెండో టెస్టులో రాహుల్ ఓపెనర్‌గా రాగా హిట్ మ్యాన్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి రెండు ఇన్నింగ్సుల్లో 9 పరుగులే చేశారు. గత 12 ఇన్నింగ్సుల్లో ఆయన ఒకే అర్ధసెంచరీ చేశారు.
AP: గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము లిక్కర్ విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌ను పూర్తిగా అమలు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాలలో డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి అని అధికారులను సీఎం ఆదేశించారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలన్నారు.
రేపు సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ జన్మదినం సందర్భంగా ఆయన CDPని నటుడు రానా రిలీజ్ చేశారు. వెంకీ కొత్త మూవీ, వింటేజ్ లుక్‌తో కూడిన ఫొటోలను ఇందులో పొందుపరిచారు. 7 నంది అవార్డులు, ఆరు ఫిల్మ్ ఫేర్ సొంతం చేసుకున్నారని పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు వెంకీ మామకు సినీ వర్గాలు ముందుగానే బర్త్ డే విషెస్ చెబుతున్నాయి. వెంకటేశ్ నటిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ JAN 14న రిలీజ్ కానుంది.
‘పుష్ప-2’ సినిమా ఫస్ట్ వీక్‌లో రూ.1067కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తొలి వారంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించినట్లు పేర్కొంది. నిన్న రూ.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో రూ.31.50 కోట్లు హిందీ నుంచి వచ్చినవే ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో <<14859693>>ఈ చట్టాన్ని<<>> ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 1947, AUG 15 నాటికి ఉన్న మతపరమైన స్థలాలను మరో మతానికి చెందిన స్థలాలుగా మార్చడానికి అధికారం ఉండదు. ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. అయోధ్య రామ మందిరాన్ని ఈ చట్టం నుంచి మినహాయించారు. చట్టం తీసుకొచ్చే నాటికి కోర్టులో దీనిపై వ్యాజ్యం నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాలో సమంత స్పెషల్ పోస్ట్ చేశారు. కీర్తి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ ‘అందమైన ఈ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జోడీ ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషంతో ఉండాలి’ అని రాసుకొచ్చారు. కాగా వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు.
Sorry, no posts matched your criteria.