India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.
TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ రాత్రి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీని కూడా సీఎం కలవనున్నారు.
ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.
అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాల జాబితాను IMDb ప్రకటించింది. జనవరి 1 నుంచి నవంబర్ 25వ తేదీ మధ్య విడుదలైన అన్ని చిత్రాల్లో రేటింగ్స్ బట్టి టాప్-10 జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా టాప్-1లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ‘స్త్రీ-2’, మహారాజా, సైతాన్, ఫైటర్, మంజుమ్మల్ బాయ్స్, భూల్ భులయ్యా-3, కిల్, సింగమ్ అగైన్, లాపతా లేడీస్ ఉన్నాయి.
AP రాజధాని అమరావతికి రూ.8వేల కోట్ల రుణం మంజూరుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదం తెలిపింది. రుణాన్ని ఆమోదిస్తూ ADB బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకోగా, ఇవాళ్టి కలెక్టర్ల సమావేశంలో CRDA కమిషనర్ ఆ విషయం వెల్లడించారు. ఈ నెల 19న జరిగే ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశంలో ఆమోదం తర్వాత ఒప్పంద పత్రాలను అధికారులు మార్చుకోనున్నారు. తొలి విడతలో రూ.3వేల కోట్లు రిలీజ్ కానున్నాయి. ఆ తర్వాత మిగతావి విడుదలవుతాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఇలాంటి నిరాధార, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరింది. అనధికార సమాచారాన్ని షేర్ చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. సరైన వివరాలకు టీమ్ ఇచ్చే అప్డేట్స్‌ను అనుసరించాలని సూచించింది.
TG: డేటా బేస్‌లో మార్పుల కారణంగా ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు డేటాబేస్ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఈ మధ్య కాలంలో పోర్టల్‌లో సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది.
బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్-5’ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ స్టంట్ చేస్తున్న సమయంలో ఒక వస్తువు ఆయన కంటికి తగిలినట్లు తెలిపాయి. సిబ్బంది వెంటనే నేత్ర వైద్యుడిని సెట్స్‌కి పిలిపించి చికిత్స చేయించినట్లు సమాచారం. ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారని తెలుస్తోంది. దీనిపై ఆయన టీమ్ స్పందించాల్సి ఉంది.
భరతనాట్య కళాకారిణి, ఉపాధ్యాయురాలు యజ్ఞికా అయ్యంగార్ తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి నృత్యం చేసి ఔరా అనిపించారు. గర్భవతి అయిన దేవకి, పుట్టబోయే కృష్ణుడి మధ్య మాతృ బంధాన్ని వెల్లడించే ‘మాతృత్వం’ అనే అంశంపై ఆమె ప్రదర్శన ఇచ్చారు. డాన్స్ చేసే సమయంలో తాను కడుపులోని పాప కూడా తన్నడాన్ని అనుభవించినట్లు చెప్పారు. దాదాపు గంటపాటు ప్రదర్శన ఇచ్చారు.
ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.
Sorry, no posts matched your criteria.