India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించే బాధ్యతేమీ తమకు లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే వ్యాఖ్యానించారు. ‘వారి గెలుపు బాధ్యత మాది కాదు కదా? స్ఫూర్తిదాయకమైన పోరాటంతో ఎన్నికల్లో బలమైన ప్రదర్శన చేయడమే మా బాధ్యత. కేజ్రీవాల్ గోవా, హరియాణా, గుజరాత్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేశారు కదా? గోవా, ఉత్తరాఖండ్‌లో ఆప్‌కు వచ్చిన ఓట్ల తేడాతోనే మేం ఓడిపోయాం’ అని గుర్తుచేశారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.

AP సీఎం చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరఫున షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించి ఆహ్వానించింది. ఆ పార్టీ ఆశించినట్లే చంద్రబాబు ప్రచారం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.

రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్న అధికారుల సూచనలపై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విటర్లో మండిపడ్డారు. ఇంకెన్నిసార్లు ప్రజల్ని మోసం చేస్తారంటూ ప్రశ్నించారు. ‘ప్రజాపాలనలో, కులగణనలో, గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు మీసేవలో దరఖాస్తులు అంటున్నారు. ప్రజాపాలన, గ్రామసభల దరఖాస్తులకు విలువ లేదా? కాలం వెళ్లదీయడం మానేసి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేయండి’ అని హితవు పలికారు.

ప్రస్తుతం వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలను చూస్తుంటే బీజేపీ 27ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ.. సీఎం పోస్టుపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. అది తమకు పెద్ద సమస్య కాదన్నారు. ప్రస్తుతం బీజేపీ 42+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ వెనుకంజ వేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆరు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కన్నా 300 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

AP: మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మల్టీ ట్యాలెంట్‌తో అదరగొడుతున్నారు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. నైజీరియాలో జరిగిన ’గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ ఫెస్టివల్’లో ఆమె ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో అన్షు షేర్ చేశారు. ఇటీవల ఆమె గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ అవార్డు సైతం అందుకున్నారు.

బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్‌కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.

ఢిల్లీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో 17 నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య మార్జిన్ 1000 మాత్రమే ఉంది. BJP 12, AAP 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్క రౌండులోనైనా ఏదో ఒక పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడినట్లు తేలితే ఆధిక్యాలు మారడం ఖాయమే. అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ మార్లేనా 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు.

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 36 కన్నా ఇది 7 స్థానాలు ఎక్కువ. ఆమ్‌ఆదీ పార్టీ 30 సీట్లతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఓట్ షేరు 48.03 శాతంగా ఉంది. ఆప్ 42.58 శాతం సాధించింది. కాంగ్రెస్‌కు 6.74% ఓట్‌షేర్ రావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.