news

News November 11, 2024

అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ

image

అయోధ్య రామ మందిరం స‌హా ప‌లు ఆల‌యాల‌పై దాడి చేస్తామ‌ని ఖలిస్థానీ ఉగ్రవాది గురుప‌త్వంత్ సింగ్ హెచ్చ‌రించాడు. Nov 16-17 తేదీల్లో ఈ దాడులు చేస్తామంటూ వీడియో విడుదల చేశాడు. దీన్ని కెన‌డాలోని బ్రాంప్ట‌న్‌లో రికార్డు చేశాడు. హింసాత్మ‌క హిందుత్వ భావ‌జాలం పుట్టిన అయోధ్య పునాదులు క‌దుపుతామ‌ని హెచ్చ‌రించాడు. పన్నూపై గతంలోనే అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. US, కెనడా నుంచి భారత్‌పై అతను విషం చిమ్ముతున్నాడు.

News November 11, 2024

పోలీస్ యూనిఫామ్‌లో ప్రభాస్.. ఆర్ట్ అదుర్స్!

image

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్టిస్ట్ హర్ష గీసిన ఆర్ట్ వైరలవుతోంది. కొరియన్ నటుడు డాన్లీ విలన్ పాత్రలో నటిస్తారని వార్తలొస్తుండటంతో ఆయనతో పాటు పోలీస్ యూనిఫామ్‌లో ప్రభాస్ చిత్రాన్ని గీశారు. మూవీలో ప్రభాస్ లుక్ ఇలా ఉంటే అదిరిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News November 11, 2024

దసరా బరిలో వేణు ‘ఎల్లమ్మ’ మూవీ: దిల్ రాజు

image

బలగం సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వేణు తన తదుపరి చిత్రాన్ని హీరో నితిన్‌తో తీయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. వచ్చే దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘దసరా’ సినిమాలోని మాస్ సీన్స్‌కు డబుల్ ఉంటాయని నిర్మాత చెప్పడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరో హిట్ కొట్టాలని వేణు‌కు ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.

News November 11, 2024

కాలుష్య నియంత్రణకు త్వరలోనే సమగ్ర విధానం: CM

image

హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కాలుష్య నియంత్రణపై త్వరలోనే సమగ్రమైన విధానం ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్‌ పరిధిలో కొత్తగా 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. నగరంలో కాలుష్యం తగ్గించడం, మూసీ పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

News November 11, 2024

‘విస్తారా’కు టాటా..!

image

టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘విస్తారా’ ఇండియాలో తన చివరి విమాన సర్వీసును పూర్తి చేసింది. ఈ కంపెనీ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో ఆ బ్రాండ్ ఇవాళ్టితో మన దేశంలో కనుమరుగు అవ్వనుంది. రేపటి నుంచి విస్తారా విమానాలు కూడా ఎయిర్ ఇండియా పేరుతో నడుస్తాయి. ఇక నుంచి తమ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉండదని, రేపటి నుంచి http://airindia.comలో తాము అందుబాటులో ఉంటామని విస్తారా ట్వీట్ చేసింది.

News November 11, 2024

రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్

image

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో గైనకాలజిస్ట్ డా.ప్రీతి చల్లాకు మూడుముళ్లు వేశారు. వీరిద్దరి ఫొటోను సినీవర్గాలు షేర్ చేస్తూ విషెస్ తెలియజేస్తున్నాయి. కాగా, ఈనెల 16న రిసెప్షన్‌ కూడా ఉంటుందని, దీనికి సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. 2016లో మొదటి వివాహం చేసుకున్న క్రిష్ 2018లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

News November 11, 2024

ఆ ఉద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్

image

AP: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)తో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలోని ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వ హయాంలో 21రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నేడు ఆ ఉత్తర్వులు జారీ అయినట్లు లోకేశ్ పేర్కొన్నారు.

News November 11, 2024

ఇప్పుడే వచ్చా.. అప్పుడే వణికితే ఎలా?: KTR

image

TG: మాజీ మంత్రి KTR ఢిల్లీ పర్యటనపై BRS, INC మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ‘అమృత్’ స్కామ్‌లో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని KTR అన్నారు. అయితే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆయన హస్తినకు వెళ్లారని మంత్రులు ఆరోపించారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన KTR ‘ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. అప్పుడే HYDలో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పుడే వణికితే ఎలా?’ అని సెటైర్ వేశారు.

News November 11, 2024

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ పెద్దలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తారని సమాచారం. అనంతరం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్న ఆయన, అక్కడ రెండు రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

News November 11, 2024

నెలకు రూ.5వేలు పొదుపు.. 60ఏళ్లకు రూ.65 కోట్లు!

image

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం <>‘NPS వాత్సల్య స్కీమ్’<<>> తీసుకొచ్చింది. 0-17 ఏళ్లలోపు పిల్లల పేరిట అకౌంట్ తీయాలి. దీనిలో ప్రతి నెలా రూ.5వేలను మీ పిల్లల కోసం పొదుపు చేస్తే చాలు. పిల్లాడికి 18 ఏళ్లు రాగానే ఏటా 12% రిటర్న్స్‌తో వారికి రూ.40లక్షలు అందుతాయి. అలాగే కంటిన్యూ చేస్తే మేజర్ అకౌంట్‌గా మారుతుంది. 60 ఏళ్ల వరకూ పొదుపు చేస్తే రూ. 64.5 కోట్లు పొందవచ్చు. >SHARE IT