India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీంతో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. రిలీజ్ లోపు రెండు ట్రైలర్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 5న ‘పుష్ప-2’ రిలీజ్ కానుంది.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన పోలీసు అధికారి తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు ఉన్నట్టు గుర్తించారు.
సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయ్యింది. ఈ నెల 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాలో సాయిచంద్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 11న <<14329220>>విడుదలైన<<>> ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
తూ.గో.- ప.గో. జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లకు రేపటి నుంచి ఈ నెల 18 వరకు గడువు ఇచ్చారు. 19న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, డిసెంబర్ 5న ఎన్నిక నిర్వహించనున్నారు. 2023 డిసెంబరులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉప ఎన్నిక జరుగుతోంది.
AP: రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌కు ఆమోదం లభించింది. రేపు అసెంబ్లీకి సెలవు ఉండనుంది. రేపు ఉ.11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఉంటాయి. మ.2 గంటలకు కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.
మహారాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో MVA కూటమి LGBTQIA+ కమ్యూనిటీకి ప్రత్యేక హామీలివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరికి రిజర్వేషన్లు, స్పెషల్ స్కాలర్‌షిప్స్ కల్పిస్తామని తెలిపింది. వీరి అవసరాల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై లా కమిషన్ ఆధ్వర్యంలో సలహాదారుల కమిటీని నియమిస్తామని చెప్పింది. స్పెషల్ హెల్త్, కౌన్సెలింగ్ సెంటర్లు, జీవనోపాధి కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంది.
AP: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్(రైతు భరోసా) పథకం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రైతులకు ఏడాదికి రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. పథకం విధివిధానాలు, మార్గదర్శకాలపై త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ కోసం బడ్జెట్‌లో రూ.4,500 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
EPFO గరిష్ఠ వేతన పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ వెల్లడించింది. సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై 12%, యజమాని వాటా 12% చెల్లిస్తారు. వేతన పరిమితి పెంచడం వల్ల ఉద్యోగుల భవిష్య నిధికి జమయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది. చివరిసారిగా 2014లో రూ.6,500గా ఉన్న వేజ్ సీలింగ్‌ను రూ.15వేలకు కేంద్రం పెంచింది.
పిల్లలకు కూల్ డ్రింక్స్ కొనివ్వొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తయారీదారులే కార్బోనేటెడ్ శీతల పానీయలను పిల్లలకు సిఫార్సు చేయొద్దని వాటిపై రాస్తున్నారని తెలిపారు. పిల్లలు కెఫిన్ కలిపిన సోడాను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని పలు అధ్యయనాల్లో తేలిందన్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, మద్యం తాగాలనే ఆలోచనలు రావడం, అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం వంటి రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
AP: కని పెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. తీవ్ర వినికిడి లోపం ఉన్న ఆమెను మరో ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి(D) సోమందేపల్లిలో జరిగింది. తన బిడ్డ భోజనం తెచ్చేందుకు వెళ్లాడని ఆమె దీనంగా రోడ్డు పక్కన కూర్చుండిపోయింది. స్థానికులు ఆమెకు భోజనం, నీరు అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఓ వృద్ధాశ్రమానికి తరలించారు.
Sorry, no posts matched your criteria.