India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✒ తేది: ఫిబ్రవరి 08, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.9.30 వరకు
✒ నక్షత్రం: మృగశిర రా.7.32 వరకు
✒ శుభ సమయాలు: ఉ.11.35 నుంచి మ.12.11 వరకు, సా.4.35 నుంచి 5.23 వరకు
✒ రాహుకాలం: ఉ.9.30 నుంచి మ.10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి ఉ.7.36 వరకు
✒ వర్జ్యం: తె.జా.3.42 నుంచి 5.15 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.07 నుంచి 2.38 వరకు

* రాష్ట్రంలో BCల జనాభా పెరిగింది: రేవంత్
* విజన్-2047కు సహకరించండి: నీతిఆయోగ్‌తో చంద్రబాబు
* ఒంగోలులో ముగిసిన RGV విచారణ
* విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్
* కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
* ఒక్క వ్యక్తికే రతన్ టాటా ఆస్తిలో ₹500కోట్లు!
* జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
* వడ్డీరేట్లు తగ్గించిన RBI
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్‌ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్‌గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్‌బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్‌గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.

రోజూ పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి హాయిగా నిద్రపట్టేందుకు సహకరిస్తాయని అంటున్నారు. లావెండర్ టీ తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర కలుగుతుంది. చమోమిలే టీ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం కలిగి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. పిప్పరమెంట్ టీ కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. వేడి పాలలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్స్‌గా మారుతుంది.

మరో బాలీవుడ్ నటి సన్యాసినిగా మారారు. నటి ఇషికా తనేజా కుంభమేళాలో సన్యాసం స్వీకరించారు. ఇకపై తాను సినిమాల్లో నటించనని పుణ్యస్నానం ఆచరించి ప్రతిజ్ఞ చేశారు. కాగా ఇషికా 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.

AP: తాడేపల్లిలోని మాజీ CM జగన్ ఇంటి ముందు జరిగిన అగ్నిప్రమాదంపై గుంటూరు SP సతీశ్ కుమార్ మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని, కుట్రకోణం ఉందేమో అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ నివాసంలోని రోడ్డులో ఉన్న CC కెమెరాలోని డేటాను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని SP వెల్లడించారు.

సింపుల్ ట్రిక్ పాటిస్తే ఫ్రీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉండాలి. మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు Settings> Network> Internet Settings > Sim & Mobile network> Sim> Wifi Calling Toggle> activate చేయాలి. మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్‌గా వైఫైతో కాల్స్ చేసుకోవచ్చు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు హోస్ట్ పాకిస్థాన్ తన జెర్సీ ఆవిష్కరించింది. గత జెర్సీకి భిన్నంగా దీనిని రూపొందించారు. కాగా ఇవాళ లాహోర్‌లోని గడాఫీ స్టేడియాన్ని PCB పున:ప్రారంభించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ మైదానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. కొత్త ఫ్లడ్‌లైట్లు, సీట్లు, ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డులు, ఎల్ఈడీ టవర్లు, వీవీఐపీ బాక్సులు వంటివి నిర్మించారు. కాగా పాక్ ఆటగాళ్ల జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.