news

News February 7, 2025

కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

TG: రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునేలా ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్‌లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, ఎప్పటికీ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

News February 7, 2025

గురుకులాలు, హాస్టళ్లకు నిధులివ్వండి: మంత్రి స్వామి

image

AP: PM-AJAY పథకం కింద ఎంపిక చేసిన 526 గ్రామాలకు రూ.110cr విడుదల చేయాలని కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, రామ్‌దాస్ అథవాలేను మంత్రి స్వామి కోరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన 75 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి రూ.245cr, గురుకులాల్లో మౌలిక వసతులకు రూ.193cr.. SC, ST అట్రాసిటీ బాధితులకు రూ.95.84cr, తదితరాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వీటిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.

News February 7, 2025

TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు కొలిక్కి

image

TG: TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు తుదిదశకు చేరింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశముంది. కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల, రోహిణ్, రాజేందర్.. SCల నుంచి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం.. STల నుంచి బలరాం, బెల్లయ్య, మురళి.. మైనారిటీల నుంచి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్‌ ఖాన్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

News February 7, 2025

గుడ్లను ఇలా ఉడికిస్తున్నారా?

image

గుడ్డులో పోషకాలు, రంగు, రుచి ప్రత్యేకంగా ఉండాలంటే ఓ పద్ధతి ప్రకారం ఉడికించాలని US శాస్త్రవేత్తలు తెలిపారు. గుడ్డు సరిగ్గా ఉడకాలంటే ముందుగా మరుగుతున్న నీటిలో నుంచి గోరు వెచ్చని నీటిలోకి.. అలాగే గోరు వెచ్చని నీటిలో నుంచి మరుగుతున్న నీటిలోకి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మార్చాలి. ఇలా 32 నిమిషాలపాటు చేయాలి. ఆ తర్వాత చల్లని నీటిలో ఉంచి పెంకు తీయాలి. ఇలా చేస్తే గుడ్డులోని పోషకాలు సమతుల్యంగా లభిస్తాయి.

News February 7, 2025

కాలేజీలో నాపై ఎంతోమందికి క్రష్: రష్మిక

image

కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ఆ తర్వాత దేశం మొత్తానికి క్రష్‌గా మారానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కిరిక్ పార్టీ(కన్నడ) సినిమా తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ వచ్చింది. ఈ ట్యాగ్ దేశం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక కాలి గాయంతో బాధపడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు.

News February 7, 2025

ఆదాయం ప్రకటించిన ఎల్‌ఐసీ

image

LIC ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రీమియంల ద్వారా రూ.1,06,891 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలో మెుత్తంగా సంస్థ ఆదాయం రూ.2,01,994 కోట్లు కాగా గతంతో పోలిస్తే రూ.10,453 కోట్లు తగ్గినట్లు ప్రకటించింది. ఈ నష్టాలతోLIC షేరు 2.15శాతం తగ్గి రూ.811 వద్ద ముగిసింది.

News February 7, 2025

గ్రేట్.. ఆరు నెలల బోనస్ ఇచ్చిన స్టార్టప్

image

ఉద్యోగుల విధేయతను గౌరవిస్తూ ఓ కంపెనీ వారికి 6 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చింది. TNలోని కోయంబత్తూరులో ఉన్న AI స్టార్టప్ ‘KOVAI.CO’ను శరవణ కుమార్ స్థాపించారు. మొత్తం 140 మంది ఉద్యోగులుండగా, వారికి రూ.14 కోట్లు బోనస్‌గా ఇచ్చారు. ‘స్టార్టప్‌లలో పనిచేసేందుకు ఎవరూ మొగ్గుచూపారు. మూడేళ్లు మాతో పనిచేస్తే 2025 జనవరి జీతంలో ఆరు నెలల బోనస్ ఇస్తానని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకున్నా’ అని శరవణ కుమార్ తెలిపారు.

News February 7, 2025

ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

image

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.

News February 7, 2025

రేపటి లోగా బుమ్రా ఫిట్‌నెస్‌పై రిపోర్ట్!

image

భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్‌నెస్‌పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News February 7, 2025

BCల జనాభా పెరిగింది: రేవంత్

image

TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని CM చెప్పారు.