India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో 12 దేశీయ మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 14న సేవలు ప్రారంభం కానుండగా నేటి నుంచే బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ఇండిగో సీఈవో ఎల్బర్స్ తెలిపారు. ఏ231 నియో విమానాల్లో మూడు వరుసల్లో 4 చొప్పున 12 బిజినెస్ క్లాస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఈ విమానాల్లో 208 ఎకానమీ సీట్లతో కలిపి మొత్తం 220 సీట్లు ఉండనున్నాయి.
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ నిలిపివేసింది. ఈ మేరకు ఐఎంఎంఎస్ యాప్‌లో ఈ ఆప్షన్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. ఆ బాధ్యతలను ఇతర విభాగాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుతం రోజుకో ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
15 ఏళ్ల షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందింది. జీడీపీ వృద్ధిలో వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెడీమేడ్ దుస్తుల హబ్‌గా ఎదిగింది. మరోవైపు విపరీతమైన అవినీతి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్యకు తోడు రిజర్వేషన్లతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపడంతో పరిస్థితి అదుపుతప్పి హసీనా పదవీచ్యుతురాలయ్యారు.
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదని, సొంతంగా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని వర్సిటీ రిజిస్ట్రార్‌లను ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ మేరకు పలు యూనివర్సిటీలకు లేఖ రాసింది. సర్టిఫికెట్లు అందకపోవడంతో ఉన్నత విద్య కోర్సుల్లో, ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
AP: ప్రజలతో అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు అన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అశాంతి నెలకొందని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. గత ప్రభుత్వం కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పులు చేసి భూములు కాజేసిందన్నారు. భూములను ఫ్రీహోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని దుయ్యబట్టారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకోవడం వారికి అలవాటుగా మారిందని విమర్శించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం ఇంకా కలగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాపైనే దేశం మరోసారి ఆశలు పెట్టుకుంది. ఇవాళ జావెలిన్ త్రో క్వాలిఫయర్‌లో ఆయన బరిలో దిగుతున్నారు. దీంతో నీరజ్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు మెన్స్ హాకీ సెమీఫైనల్లో ఇవాళ భారత్, జర్మనీతో తలపడనుంది. ఇవాళ్టి పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
TG: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన నేడు ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరగనుంది. భవిష్యత్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమయ్యేలా కార్యచరణను రూపొందించడంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు యువత, నిరుద్యోగ, రైతు, మహిళా సమస్యలపై ప్రత్యేక చర్చ చేపట్టే అవకాశముంది. గత ఎన్నికల వైఫల్యాలను రిపీట్ కానివ్వకుండా దిద్దుబాటు చర్యలకు భేటీలో నేతలు నిర్ణయాలు తీసుకోనున్నారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. భగత్ సింగ్ స్ఫూర్తిగా గదర్ పేరును ఆయన పెట్టుకున్నారు. గదర్ అంటే విప్లవం అని అర్థం. కాలక్రమేణా అది గద్దర్‌గా మారింది. 1969లో తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మలిదశ ఉద్యమంలో ఆయన పాట తెలంగాణ గొంతుగా మారింది. ‘బానిసలారా లెండిరా ఈ బాంఛన్ బతుకులు వద్దురా’ అంటూ ఆలోచింపజేశారు. ఆయన ఇప్పుడు సజీవంగా లేకున్నా పాట రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఇవాళ ఆయన వర్ధంతి.
పారిస్ ఒలింపిక్స్‌లో మెన్స్ ఫుట్‌బాల్‌లో స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు ఫైనల్ చేరాయి. స్పెయిన్, మొరాకో మధ్య జరిగిన తొలి సెమీస్‌లో 2-1తో స్పానిష్ జట్టు విజయం సొంతం చేసుకుంది. రెండో సెమీస్‌లో ఈజిప్ట్‌పై 3-1తేడాతో ఆతిథ్య జట్టు గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది. మరోవైపు ఎల్లుండి మొరాకో, ఈజిప్టు కాంస్యం కోసం తలపడనున్నాయి.
<<-se>>#Olympics2024<<>>
బంగ్లాదేశ్‌లో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. ఖుల్నాలో నిరసనకారుల దాడిలో అవామీ లీగ్ ప్రెసిడెంట్ GM మొహ్సిన్ రెజాతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిని తరిమికొట్టేందుకు మొహ్సిన్ తన పిస్టల్‌తో ఏడు రౌండ్లు కాల్పులు జరపడంతో హింస తీవ్రమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రతీకారంగా, ఆ గుంపు ఆయనతో పాటు డ్రైవర్ అలంగీర్, వ్యక్తిగత సహాయకుడు మోఫిజుల్ ఇస్లామ్‌ను కొట్టి చంపి ఇంటికి నిప్పంటించారు.
Sorry, no posts matched your criteria.