news

News December 11, 2024

గీతా పారాయణంలో గిన్నిస్ రికార్డు

image

మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికి‌పైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.

News December 11, 2024

విప‌క్షాల మాదిరి ప్ర‌శ్నించ‌కండి అంటూ సెటైర్లు

image

మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ విపక్ష రాజకీయ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. Dec 15న జరగనున్న సొసైటీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే, ఓడిపోయిన వారు విపక్షాల మాదిరి ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తవద్దని సూచించడం వైరల్‌గా మారింది. పోలింగ్‌పై భరోసా ఉంచాలని కోరింది. మూడేళ్లపాటు సొసైటీ బాధ్యతల్ని పర్యవేక్షించే కమిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమని పేర్కొంది.

News December 11, 2024

ఎల్లుండి స్వర్ణాంధ్ర-2047 విజన్ విడుదల

image

AP: డిసెంబర్ 13న స్వర్ణాంధ్ర విజన్-2047ను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో ఈ విజన్ రూపొందించామన్నారు. దీని ఆధారంగానే రాష్ట్రంలో పరిపాలన ఉండాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం వెల్లడించారు. 15శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుని కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందని సీఎం వెల్లడించారు.

News December 11, 2024

మోహన్ బాబు ఇంటి వద్ద మళ్లీ టెన్షన్

image

హైదరాబాద్ శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులు బయటకు వెళ్లిపోవాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే విష్ణు జోక్యం చేసుకుని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరని బదులిచ్చారు. మనోజ్‌కు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులు కూడా బయటకు వెళ్లాలని విష్ణు వార్నింగ్ ఇవ్వడంతో మళ్లీ అక్కడ ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

News December 11, 2024

బుమ్రాకు పెద్ద గాయం..?

image

BGTని దక్కించుకోవాలంటే టీమ్ ఇండియాకు బుమ్రా కీలకం. అందుకే రెండో టెస్టులో ఆయన గాయపడటం అభిమానుల్ని కలవరపెట్టింది. అది చిన్నగాయమేనని టీమ్ మేనేజ్‌మెంట్ కొట్టిపారేసినప్పటికీ.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డేమియన్ ఫ్లెమింగ్ మాత్రం కాకపోవచ్చంటున్నారు. ‘అది తీవ్రగాయంలాగే కనిపిస్తోంది. బుమ్రా చివరి ఓవర్ కష్టంగా పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రేక్‌లో ఇబ్బంది పడ్డారు. వేగం కూడా చాలా తగ్గింది’ అని తెలిపారు.

News December 11, 2024

కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ: హరీశ్

image

TG: కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర దీక్షకు దిగగా ఆయనను జైలులో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ రావు అన్నారు. జైలులో దీక్ష కొనసాగిస్తే కాంగ్రెస్ దిగొచ్చి డిసెంబర్ 9న ప్రకటన చేసిందన్నారు. కేసీఆర్ దీక్ష, ప్రజల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రాజీనామా చేయకుండా పారిపోయారని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఈ CM ఎక్కడున్నారని ప్రశ్నించారు.

News December 11, 2024

APకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

image

APకి రూ.4లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయని కలెక్టర్ల సదస్సులో CM చంద్రబాబు వెల్లడించారు. వీటితో 4లక్షల ఉద్యోగావకాశాలు కలుగుతాయన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.31వేల కోట్లు సమకూర్చామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామసభల ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతాయన్నారు.

News December 11, 2024

వచ్చే ఏడాదిపై సమంత ఆసక్తికర పోస్ట్

image

స్టార్ హీరోయిన్ సమంత ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. వచ్చే ఏడాది తనకు ఎలా ఉంటుందో చెప్పే సందేశాన్ని పంచుకున్నారు. 2025లో చాలా బిజీగా ఉండటమే కాకుండా డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారని అందులో ఉంది. ప్రేమను పంచే భాగస్వామిని పొందడంతో పాటు కొందరు పిల్లలు కూడా కలుగుతారని, మానసికంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని ఈ లిస్టులో ఉంది. దీంతో సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

News December 11, 2024

ప్రపంచంలో భారత ఫుడ్ టేస్ట్ ర్యాంకు ఎంతంటే…

image

ప్రపంచంలో అత్యంత రుచికరమైన ఆహారం కలిగిన 100 దేశాల్లో భారత్ 12వ స్థానాన్ని దక్కించుకుంది. టేస్ట్ అట్లాస్ సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అగ్రస్థానంలో గ్రీస్, తర్వాతి స్థానాల్లో వరుసగా ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ ఆహారాలున్నాయి. భారత వంటకాల్లో హైదరాబాదీ బిర్యానీ, అమృతసరీ కుల్చా, బటర్ గార్లిక్ నాన్, బటర్ చికెన్ రుచికరమైనవని టేస్ట్ అట్లాస్ స్పష్టం చేసింది.

News December 11, 2024

మోదీని కలిసిన రాజ్ కపూర్ ఫ్యామిలీ

image

దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో ఢిల్లీలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మయ్యారు. సైఫ్ అలీఖాన్‌, క‌రీనా క‌పూర్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ త‌దిత‌రులు మోదీని క‌లిశారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న RK Film Festivalలో పాల్గొనాల్సిందిగా వారు మోదీని ఆహ్వానించారు. 13 నుంచి 15 వ‌ర‌కు 3 రోజుల‌పాటు 40 న‌గ‌రాల్లో 10 రాజ్‌ కపూర్ చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.