India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత స్టార్ బౌలర్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న వేళ జాతీయ క్రికెట్ అకాడమీలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. మరో 24 గంటల్లో ఫిట్‌నెస్‌పై నివేదిక రానుంది. దాని ఆధారంగా ఇంగ్లండ్‌తో మిగతా వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించడంపై BCCI నిర్ణయం తీసుకోనుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

TG: తాము నిర్వహించిన కులగణనలో BCల జనాభా ఐదున్నర శాతం పెరిగిందని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో CM రేవంత్ వెల్లడించారు. బీసీల జనాభా పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని చెప్పారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అటు PCC కార్యవర్గంపై ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటన వస్తుందన్నారు. ఇక తాను రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని CM చెప్పారు.

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. 34 ప్రాజెక్టుల ద్వారా రూ.6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసింది. త్వరలో ఏర్పాటు కానున్న కంపెనీల్లో 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పూర్తి వివరాలను వెల్లడించింది.

‘వందే భారత్’ రైళ్లలో ‘పుడ్ ఆప్షన్’ డెలివరీపై రైల్వే బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుక్ చేసే సమయంలో పుడ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు ఆహారం కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే, ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్న సమయంలోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫుడ్ విషయంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రైల్వే బోర్డ్ IRCTCలో ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.

బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన ఓ గర్భిణి సహర్సాకు వెళ్తుండగా రైలులోనే పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కోచ్‌లోని ఇతర మహిళలతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రసవానికి సహాయం చేశారు. దీంతో సదరు మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌ను నిలిపేసి ఆమెను ఆస్పత్రికి తరలించగా తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.

TG: మాజీ మంత్రి KTRకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. IBC-2025 సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. పదేళ్ల BRS పాలనలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అద్భుతమని ప్రశంసించింది. HYDను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని, తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి స్ఫూర్తిదాయకమని అభినందించింది.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టైటిల్‌తో పాటు టీజర్ వీడియోను ఈనెల 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ టైటిల్‌ను ‘సామ్రాజ్యం’గా ఫిక్స్ చేసినట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

AP: సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోల పోస్టుల కేసుపై ఒంగోలులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో RGV కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ‘చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలను మార్ఫ్ చేసి నేనే నా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశా. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగానే పోస్టులు చేశా. ఈ విషయంలో YCP నేతలకు సంబంధం లేదు. వారితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి’ అని చెప్పినట్లు సమాచారం.

యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఉ.7 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ప్రతి అప్‌డేట్‌ను WAY2NEWS మీకు ఎక్స్‌క్లూజివ్‌గా అందించనుంది. అన్ని వివరాలు అందరికంటే ముందే మన యాప్‌లో చూడవచ్చు.70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ BJPకే మొగ్గుచూపగా, కొన్ని AAPకూ అవకాశం ఉందని అంచనా వేశాయి.
Sorry, no posts matched your criteria.