news

News February 7, 2025

‘తండేల్’ మూవీ రివ్యూ

image

హీరోతో పాటు అతడి జాలర్ల బృందాన్ని పాక్ చెర నుంచి విడిపించేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నమే ‘తండేల్’ కథ. నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. బుజ్జితల్లి, హైలెస్సా సాంగ్స్ బాగున్నా ఒకే బీజీఎం రిపీట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ హత్తుకుంటాయి. ఫస్టాఫ్ స్లోగా సాగడం, జైల్లో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది.
రేటింగ్: 2.75/5

News February 7, 2025

అమెరికాలో విమానం మిస్సింగ్

image

అమెరికాలో విమానం అదృశ్యమైంది. 10 మందితో అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఫ్లైట్ రాడార్ సిగ్నల్స్‌కు అందకుండా పోయింది. దీంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇటీవల వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు వద్ద ఆర్మీ హెలికాప్ట‌ర్ ఢీకొట్టడంతో విమానం పోటోమాక్ నదిలో కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 67 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు.

News February 7, 2025

MUDA SCAM: సిద్దరామయ్యకు స్వల్ప ఊరట

image

ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు కొంత ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును లోకాయుక్త నుంచి సీబీఐకి బదిలీ చేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ‘లోకాయుక్త దర్యాప్తు బాగాచేయడం లేదనేలా, లోతైన దర్యాప్తు కోసం సీబీఐకి బదిలీ చేయాలనేలా మెటీరియల్ ఎవిడెన్స్ ప్రతిబింబించడం లేదు’ అని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. దీంతో పిటిషనర్ స్నేహమయీ కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.

News February 7, 2025

CUET PG: రేపే లాస్ట్ డేట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. NTA ఆన్‌లైన్ <>సైట్‌లో<<>> అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపునకు ఈనెల 9 చివరి తేదీ. ఈనెల 10 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఇవ్వనున్నట్లు NTA పేర్కొంది. సెంట్రల్ వర్సిటీల్లో PG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. మరోవైపు UGC NET డిసెంబర్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

News February 7, 2025

హిందువుల ఐక్యత ప్రపంచానికి లాభం: మోహన్ భగవత్

image

భేదాలకు అతీతంగా హిందువులందరూ ఐక్యమైతే అది ప్రపంచానికి మేలు చేకూరుస్తుందని RSS చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘హిందూ సమాజం ఒక్కతాటిపై ఉన్నప్పుడే ఎదుగుదల సాధ్యం. హైందవం ఎప్పుడూ సమానత్వాన్ని కోరుకుంటుంది. దయ, జాలి, పరిశుభ్రత, ధ్యానం అనే నాలుగు హిందూధర్మంలో కీలకం’ అని పేర్కొన్నారు.

News February 7, 2025

72శాతంమంది భారతీయులకు హెచ్1బీ వీసా: కేంద్రం

image

2022 OCT-2023 SEP మధ్యకాలంలో 72.3శాతంమంది భారతీయులకు హెచ్1బీ వీసాలు జారీ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ‘ద్వైపాక్షిక చర్చల ద్వారా హెచ్1బీ వీసా గురించి అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. యుద్ధం మొదలుకావడానికి ముందు 21,928మంది భారత విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. గత ఏడాది నవంబరు సమయానికి ఆ సంఖ్య 1802కు చేరింది. ఇక ఇజ్రాయెల్‌లో 900మంది విద్యార్థులున్నారు’ అని వివరించింది.

News February 7, 2025

కోహ్లీ ఆడితే జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు?

image

మోకాలి గాయంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడతారని సపోర్ట్ స్టాఫ్ తెలిపింది. అయితే ఆయన తుది జట్టులోకి వస్తే తొలి వన్డే ఆడిన ప్లేయర్లలో ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ స్థానంలో ఆడిన శ్రేయస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న నేపథ్యంలో అతడిని పక్కనపెట్టే అవకాశం కనిపించడం లేదు. జైస్వాల్‌ను తప్పించి గిల్‌‌ను ఓపెనింగ్, కోహ్లీని వన్ డౌన్‌లో ఆడించే ఛాన్సుంది.

News February 7, 2025

అంబటి రాంబాబుకు టీడీపీ నేత కౌంటర్

image

AP: రాష్ట్రంలో ‘ర్యాంకు’ రాజకీయం నడుస్తోంది. మంత్రుల ర్యాంకుల్లో ‘8, 9 స్థానాలు వచ్చిన లోకేశ్, పవన్‌కు అభినందనలు’ అంటూ <<15384201>>అంబటి రాంబాబు<<>> చేసిన ట్వీట్‌కు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘అయ్యా అంబటి 8, 9 స్థానాల్లో వచ్చిన వారిద్దరూ 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు’ అని సెటైర్ వేశారు.

News February 7, 2025

బీసీలకు 42శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: పొన్నం

image

TG: ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కులగణనను తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వం. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. BRS నేతలు సర్వేలో పాల్గొనలేదు. పైగా అవహేళన చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

News February 7, 2025

జగన్ ‘క్యారెక్టర్’ కామెంట్స్.. స్పందించిన VSR

image

AP: రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం అంటూ YS జగన్ చేసిన <<15377485>>వ్యాఖ్యలపై<<>> మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా’ అని ట్వీట్ చేశారు.