news

News February 7, 2025

వాట్సాప్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు.. టెన్త్ కూడా

image

AP: ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేసే ఘటనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్ హాల్‌టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని నిర్ణయించింది. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలో టెన్త్ విద్యార్థులకు సైతం ఇదే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 10-20 వరకు, పరీక్షలు మార్చి 1-20 వరకు జరుగుతాయి.

News February 7, 2025

గ్రూప్-1 ఫలితాలపై UPDATE

image

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2, 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.

News February 7, 2025

బీసీకి డిప్యూటీ సీఎం పదవి.. రేవంత్ యోచన?

image

TG: రాష్ట్రంలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు తిరుగుతున్న నేపథ్యంలో CM రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణలో ఇద్దరు BCలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక Dy.CM పదవి ఉంటుందని టాక్. ST, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

News February 7, 2025

ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ

image

ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.

News February 7, 2025

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు

image

AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News February 7, 2025

గాజా స్వాధీనంపై ట్రంప్‌ది గొప్ప ఆలోచన: నెతన్యాహు

image

గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<15364652>>వ్యాఖ్యలను<<>> ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పు లేదని, గొప్ప ఆలోచన అని చెప్పారు. నిజంగా అది అమల్లోకి వస్తే గాజా ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాగా గాజా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే.

News February 7, 2025

సోనూసూద్‌ అరెస్ట్‌కు వారెంట్

image

నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్‌’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.

News February 7, 2025

నేడు క్యాబినెట్‌లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ, ఆమోదం!

image

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నారని పేర్కొన్నాయి. వారంలో లోక్‌సభలో ప్రవేశపెడతారని చెప్పాయి. బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కొత్త బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందరికీ అర్థమయ్యేలా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.

News February 7, 2025

English Learning: Antonyms

image

✒ Immense× Puny, Insignificant
✒ Immaculate× Defiled, Tarnished
✒ Imminent× Distant, Receding
✒ Immerse× Emerge, uncover
✒ Impair× Restore, Revive
✒ Immunity× Blame, Censure
✒ Impediment× Assistant, Concurrence
✒ Impartial× Prejudiced, Biased
✒ Impute× Exculpate, support

News February 7, 2025

క్రీడాకారులకు రూ.7.96 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల

image

AP: రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 189 మందికి రూ.7.96 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం 224 మందికి రూ.11.68 కోట్ల ఇన్‌సెంటీవ్‌లను పెండింగ్‌లో పెట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7.96 కోట్లను రిలీజ్ చేశారని తెలిపారు.