India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
EVMల ట్యాంపరింగ్, ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని INDIA కూటమి నిర్ణయించింది. హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో NDA రిగ్గింగ్‌కు పాల్పడిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాల్ని తారుమారు చేశారని ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో VVPAT, EVM ఓట్లలో <<14842152>>వ్యత్యాసం లేదని<<>> ఎన్నికల సంఘం మంగళవారం స్పష్టం చేయడం గమనార్హం.
AP: రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరు అందుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ 9 వరకు రూ.4,677 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇందులో 61.63 లక్షల కేసుల మద్యం, 19.33 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు పేర్కొంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటైన సంగతి తెలిసిందే.
TG: శంషాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే మంచు మనోజ్, మౌనిక దంపతులు ఉన్నారు. మనోజ్ అక్కడే ఉంటారా? వెళ్లిపోతారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అస్వస్థతకు గురి కావడంతో మోహన్ బాబును మంచు విష్ణు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో విష్ణు తిరిగి జల్‌పల్లికి వస్తే మళ్లీ గొడవ ఏమైనా జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంది. అటు మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
AP: భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు బాధ్యత, అంకితభావంతో పనిచేసేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘కొందరు ఉద్యోగులు భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ అందిస్తాం. దీని ద్వారా అమర్యాదగా వ్యవహరించే ఉద్యోగులను భక్తులు గుర్తించే అవకాశం ఉంటుంది’ అని Xలో బీఆర్ నాయుడు పోస్ట్ చేశారు.
Jan 13 నుంచి Feb 26 వరకు జరగనున్న మహా కుంభమేళా- 2025కు ప్రపంచం నలుమూలల నుంచి 40 కోట్ల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని UP ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల సంఖ్యను కచ్చితత్వంతో నిర్ధారించేందుకు AI కెమెరాలను ఉపయోగించనున్నారు. జనసమూహం నిర్వహణలో కొత్త మైలురాయిని సృష్టించడం సహా ఇలాంటి స్మారక కార్యక్రమాల్లో ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తోంది.
జైళ్ల శాఖలో ఉన్న పోస్టులు, ఖాళీలు-వాటి భర్తీ చర్యల వివరాలు సమర్పించాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కారాగారాలు నిండిపోతుండడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ హృషికేశ్ రాయ్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. జైళ్లు నిండిపోయి కారాగారాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు ఖైదీలు, విచారణ ఖైదీల సమస్యలు పెరిగే అవకాశముందని పేర్కొంది. వివరాలు సమర్పించేందుకు 8 వారాల గడువిచ్చింది.
TG: <<14843588>>మీడియాపై దాడి<<>> నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు విష్ణు, మనోజ్‌కు నోటీసులిచ్చారు. వీరిని రేపు ఉదయం 10.30 గంటలకు CP కార్యాలయానికి హాజరు కావాలన్నారు. కాగా మోహన్ బాబు గన్‌ను పోలీసులు సరెండర్ చేసుకున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
TG: డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘4 కోట్ల ప్రజల మనోఫలకాలపై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి నేడు సచివాలయ నడిబొడ్డున నిజమైన రూపంగా అవతరించిన శుభ సందర్భం. ఇది తల్లి రుణం తీసుకున్న తరుణం’ అని Xలో రాసుకొచ్చారు.
TG: మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు. జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. మరోవైపు మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
AP: విశాఖలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్ కోసం వచ్చిన మహిళ దుస్తులు విప్పించి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సదరు వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మహిళలతో ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా నిందితుడు ప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
Sorry, no posts matched your criteria.