India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగ్‌పూర్ వేదికగా నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి ODI జరగనుంది. మ.1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20ల్లో చూపిన జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని IND ఉవ్విళ్లూరుతోంది. రోహిత్, కోహ్లీ, గిల్, రాహుల్, శ్రేయస్, హార్దిక్, అక్షర్, జడేజా, షమీ, అర్ష్‌దీప్, కుల్దీప్, సుందర్, వరుణ్‌లతో జట్టు సమతూకంగా ఉంది. అటు వన్డేల్లో బోణీ కొట్టాలని ENG ఆరాటపడుతోంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

MGNREGA పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కేంద్రం చెల్లించాల్సిన వేతనాలు బకాయిలు రూ.6,434 కోట్ల వరకూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేశ్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. అత్యధికంగా తమిళనాడుకు రూ.1652 కోట్లు, UPకి రూ.1214 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2022-23 కాలంలో దేశవ్యాప్తంగా 86.17 లక్షలమంది, 2023-24లో 68.86 లక్షలమంది కూలీలను తొలగించినట్లు వెల్లడించారు.

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.6,200 కోట్ల అప్పునకు బ్యాంకులు రూ.14,131 కోట్ల ఆస్తులను రికవరీ చేశాయని తెలిపారు. అయినా ఇంకా జప్తు కొనసాగుతోందని, దీనిపై స్టే విధించాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13లోగా స్పందించాలని న్యాయస్థానం 10 బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి వేడి పెరిగింది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మంగళవారం రికార్డు స్థాయిలో 15,582 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది అదేరోజు 13,276 మెగావాట్ల వినియోగం నమోదవడం గమనార్హం. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు ఉంటున్నాయి. మరో వారంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 21,45,330 మందికి ₹1,126Cr జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి ₹6K చొప్పున లబ్ధి చేకూర్చినట్లు తెలిపింది. త్వరలోనే 2, 3 ఎకరాల రైతులకు నిధులు జమ చేస్తామంది. కాగా MLC ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్‌గోయింగ్ స్కీమ్ కింద ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. మరి మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

AP: అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి డిమాండ్ తగ్గడంతో రేటు భారీగా పతనమైంది. గత ఏడాది క్వింటా ₹35K పలికిన ధర ఇప్పుడు రకాన్ని బట్టి ₹10K-₹17K లోపే ఉంటోంది. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి. విత్తనం, పురుగుమందుల రేట్లు పెరగడం, కూలీల డిమాండ్ కారణంగా ఎకరాకు ₹3L ఖర్చవుతుంటే దిగుబడి 20-22 క్వింటాళ్లే వస్తోంది. దీంతో రైతులు కుదేలవుతున్నారు. ధర విషయంలో ప్రభుత్వం కలగజేసుకోవాలని కోరుతున్నారు.

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయన వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్ఠానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా ఆయన చర్చించవచ్చని సమాచారం.

AP: కల్లు గీత కులాలకు ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల పాలసీకి స్పందన కరువైంది. 339 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే నిన్నటికి 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. దీంతో ఎక్సైజ్ వర్గాలు షాకయ్యాయి. ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు.

AP: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్‌నెట్స్ అందిస్తామని చెప్పారు. ఒక్కో షెడ్ వ్యయం ₹3.22Lకాగా సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పారు. జాతీయ జీవనోపాధుల పథకం కింద రాష్ట్రానికి ₹1,000Cr కేంద్ర నిధులు పొందనున్నట్లు పేర్కొన్నారు.

<<15370291>>ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్<<>> స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారు. జీవనవిధానంలో మార్పులు, మెడ దగ్గర దెబ్బ తగలడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్పాండిలైటిస్ వస్తుంది. దీనివల్ల మెడ, వెన్నెముక వద్ద తీవ్రమైన నొప్పి ఉంటుంది. తూలి పడిపోతున్నామనే భావన కలుగుతుంది. వాంతులు రావడం, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మెడ, భుజాలు, చేతులకు తిమ్మిర్లు, నిద్రలేమి సమస్య ఏర్పడతాయి. వ్యాధి ముదిరితే కండరాలు కృశించి పోయే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.