news

News December 9, 2024

పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరింపులు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు కలకలం రేపాయి. ఆయనను చంపేస్తానని ఓ అగంతకుడు డిప్యూటీ సీఎం ఆఫీసుకు మెసేజ్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు దీనిపై డిప్యూటీ సీఎం పేషీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.

News December 9, 2024

జమిలి ఎన్నికలు: ఈ సమావేశాల్లోనే బిల్లు!

image

జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు NDA ప్రభుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్‌ బిల్లును ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే స‌భ ముందుకు తెచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. సభలో చర్చ అనంతరం దీనిపై JPCని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. Sep 18న రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ప్రతిపాదనలను క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే.

News December 9, 2024

RBI కొత్త గవర్నర్ సంజ‌య్ మ‌ల్హోత్రా నేపథ్యం

image

RBI గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులైన సంజ‌య్ మ‌ల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ క్యాడర్ IAS అధికారి. IIT కాన్పూర్‌‌లో Graduation, Princeton University నుంచి పబ్లిక్ పాలసీలో Masters చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ‌లోనూ ప‌ని చేశారు. రాజస్థాన్‌లో విద్యుత్ విభాగ ప్రధాన కార్యదర్శిగా సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేశారు. ఆర్థిక సేవలు, ఎన‌ర్జీ, IT, మైనింగ్, Taxation రంగాల్లో ఆయనకు 33 ఏళ్లు పనిచేసిన అనుభ‌వం ఉంది.

News December 9, 2024

స్ట్రెస్ సర్వే.. ‘YES’ అన్నవారిని తొలగించారు!

image

ఎలాంటి ఉద్యోగమైనా ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. యూపీలోని ‘YES MADAM’ అనే కంపెనీ ఉద్యోగులు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అనే దానిపై సర్వే నిర్వహించింది. కంపెనీలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నామని బదులిచ్చారు. వారికి HR నుంచి టెర్మినేషన్ మెయిల్ రావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ‘హెల్తీ ఎన్విరాన్మెంట్ అందించడానికి మీ అభిప్రాయాలు పరిశీలిస్తాం. అయితే ఒత్తిడి ఉందన్నవారిని తొలగిస్తున్నాం’ అని కంపెనీ తెలిపింది.

News December 9, 2024

ఒక్క రోజు స్కూల్ స్కీమ్ @ Rs.17000

image

ఫారిన్ టూరిస్టులను ఆకర్షించేందుకు జపాన్ కంపెనీ ఉండోకైయా కొత్తగా ఆలోచించింది. జపనీస్ స్కూల్ లైఫ్‌ను ఆస్వాదించేందుకు ఒక రోజు స్టూడెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. రూ.17వేలు చెల్లిస్తే చాలు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా చేరొచ్చు. యూనిఫాంతో పాటు కటానా ఫైట్ నేర్చుకొనేందుకు కిమినోస్ డ్రెస్ ఇస్తారు. స్థానిక డాన్స్ నేర్పిస్తారు. యాక్టివిటీస్ చేయిస్తారు. క్లాసుల మధ్యలో భూకంపం వస్తే ఎలా బయటపడాలో బోధిస్తారు.

News December 9, 2024

ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త గవర్నర్‌గా IAS సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ రేపు రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎల్లుండి నుంచి మూడేళ్లపాటు మల్హోత్రా గవర్నర్‌గా కొనసాగుతారు.

News December 9, 2024

మేం ఏమన్నా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?: మ‌మ‌త

image

భారత్‌లోని పలు రాష్ట్రాలను ఆక్ర‌మించుకుంటామ‌ని కొంద‌రు బంగ్లా రాజ‌కీయ నేతలు, మాజీ సైనికోద్యోగులు చేసిన వ్యాఖ్య‌ల‌కు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కౌంట‌ర్ ఇచ్చారు. ‘మీరు బెంగాల్‌, ఒడిశా, బిహార్‌ల‌ను ఆక్ర‌మించుకుంటుంటే మేము మాత్రం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?’ అంటూ కౌంట‌ర్ అటాక్ చేశారు. బంగ్లాలో హిందువులు హింస‌కు గుర‌వుతుండ‌డంపై బెంగాల్ హిందూ, ముస్లింలు ఆందోళ‌న‌గా ఉన్నార‌ని ఆమె పేర్కొన్నారు.

News December 9, 2024

ధ‌న్‌ఖఢ్‌పై విప‌క్షాల అవిశ్వాస తీర్మానం!

image

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ జగదీప్ ధ‌న్‌ఖఢ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని విప‌క్ష ఇండియా కూట‌మి పార్టీలు నిర్ణ‌యించాయి. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న స‌భ‌ను న‌డుపుతున్న తీరుపై విప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఛైర్మన్ తమతో వాగ్వాదానికి దిగుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన తీర్మానంపై TMC, AAP, SP సంత‌కాలు చేశాయి. త్వరలో సభలో ప్రవేశపెట్టనున్నాయి.

News December 9, 2024

తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

TG: రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్న లక్ష్మీనక్షత్ర(13)ను ఆమె తల్లి ఏదో విషయంలో మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన ఆమె రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీనక్షత్ర మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

News December 9, 2024

గ్రూప్-2 వాయిదాకు ఆదేశించలేం: హైకోర్టు

image

TG: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పరీక్షకు వారం రోజుల ముందు తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గ్రూప్-2, RRB పరీక్షలు ఒకే రోజు ఉన్నాయని, పరీక్షలు వాయిదా వేయాలని పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల కావడం గమనార్హం.