India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎండిన కొబ్బరి కాయ, కుడకలు(కొబ్బరి ముక్కల) విమానంలోని క్యాబిన్ బ్యాగేజ్‌లోకి సిబ్బంది అనుమతించరు. వాటికి మండే స్వభావమే ఇందుకు కారణం. అలాగే కొబ్బరి ప్రసాదాన్ని కూడా క్యాబిన్ బ్యాగేజ్‌లోకి అనుమతించరు. అయితే చెక్ ఇన్ లగేజ్‌లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. క్యాబిన్ బ్యాగేజ్ అంటే ఫ్లైట్‌లో ప్రయాణికులతో పాటు ఉంచుకునేది. చెక్ ఇన్ లగేజ్ అంటే సిబ్బందికి అప్పగించి, బెల్ట్ వద్ద తీసుకునేది.
AP: ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విస్మరించారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘రైతులకు పెట్టుబడి సాయం, విద్యార్థులకు అమ్మఒడి, వసతి దీవెన, మహిళలకు రూ.1800, సున్నా వడ్డీ మాఫీని సీఎం ఎగ్గొట్టారు. కానీ నేను సీఎంగా ఉన్నప్పుడు వారందరినీ ఆదుకున్నా. ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు బేషరతుగా అమలు చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్ అల్లకల్లోలం నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో హోంమంత్రి అమిత్ షా అత్యవసర భేటి నిర్వహించారు. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చించారు. భారత్, బంగ్లా బోర్డర్‌లో భద్రత పెంపు, ఢిల్లీలో షేక్ హసీనా భద్రత, బంగ్లా నుంచి అక్రమ వలసలు వంటి వాటిపై హోంమంత్రి సమీక్షించారు.
దేశంలోని పోస్టాఫీసుల్లోని 44,288 పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. నేటి నుంచి AUG 8 వరకు అభ్యర్థులు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఉదయం సర్వర్‌లో లోపం కారణంగా <
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె రియల్ ఫైటర్ అని కొనియాడుతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలో బ్రిజ్ భూషన్‌ను ఆరెస్ట్ చేయాలని ఢిల్లీ వీధుల్లో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలను ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. ఎన్నో అవమానాలు, అరెస్టులను ఎదుర్కొన్నారని, ఒలింపిక్స్‌లో గోల్డెన్ గర్ల్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్ వాహనాల్లో ప్రయాణించేవారికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. రోడ్డుపై నీరు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దారిలో వెళ్లకపోవడమే మంచిదని తెలిపారు. ‘రెండడుగుల లోతు ఉన్న నీటిలో వెళ్లిన ఓ విద్యుత్ బస్సు బ్యాటరీలోకి నీరు వెళ్లిపోయి షార్ట్ సర్క్యూట్ అయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ఈవీలు నడిపేవారు నీరు నిల్వ ఉన్న రోడ్లపై వెళ్లకండి’ అని స్పష్టం చేశారు.
AP: కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక నిఘా పెట్టారు. 8 విభాగాల పర్యవేక్షణలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ నుంచి ముంబై రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో నిన్న ఒక్కరోజే రీసైక్లింగ్ రేషన్ బియ్యం తరలిస్తున్న 6 లారీలను గుర్తించారు. దీంతో పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఇవాళ ఆదేశించారు.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఆయనకు 980 మందితో భద్రత అవసరమా అని ఆమె ప్రశ్నించారు. ‘రాజకీయ లబ్ధి కోసమే తన భద్రత, ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు వెళ్లారు. అంతేకానీ ఆయన ప్రజా సమస్యలపై కోర్టుకు వెళ్లటం లేదు. పులివెందులలోని జగన్ బాధితులు ప్రజాదర్బార్‌కు వచ్చి మొరపెట్టుకుంటున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
AP: టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు, గోపీ, రామకృష్ణలను ఆయన పరామర్శించి భరోసా ఇచ్చారు.
AP: కృష్ణా నదిలో ప్రవాహం పెరగడంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిలో పడవలు, పంట్లలో ప్రయాణించవద్దని తెలిపింది. జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. అలాగే నదిలో ఈత కొట్టడం, చేపలు పట్టడం వంటివి చేయొద్దని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరింది.
Sorry, no posts matched your criteria.