India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు, గోపీ, రామకృష్ణలను ఆయన పరామర్శించి భరోసా ఇచ్చారు.
AP: కృష్ణా నదిలో ప్రవాహం పెరగడంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నదిలో పడవలు, పంట్లలో ప్రయాణించవద్దని తెలిపింది. జంతువులను ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. అలాగే నదిలో ఈత కొట్టడం, చేపలు పట్టడం వంటివి చేయొద్దని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070, 112, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని కోరింది.
AP: బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు వైసీపీ కార్యకర్తలను జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
TG: రేవంత్ సర్కార్‌పై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘కోతలు కోసే రేవంత్.. చేతులెత్తేసే ప్రభుత్వం..’ అంటూ క్యాప్షన్‌తో ఓ ట్వీట్ చేసింది. ‘రాష్ట్రంలో కరెంట్ కోతలు, రుణమాఫీలో కోతలు, రైతు భరోసాలో కోతలు, నోటిఫికేషన్లలో కోతలు, సాగు-తాగు నీళ్లలో కోతలు, మెడికల్ సీట్ల వాటాలో కోతలు’ అంటూ ఒక ఫొటోను పంచుకుంది. BJP విమర్శలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
మోసపోయిన కస్టమర్లకు FY24లో ప్రభుత్వ బ్యాంకులిచ్చిన పరిహారం రూ.140 కోట్లని FM నిర్మల తెలిపారు. FY23లో ఈ విలువ రూ.42 కోట్లన్నారు. FY24లో UBI రూ.74.96 Cr, BOI రూ.20.38 Cr, IB రూ.16 Cr చెల్లించాయన్నారు. 2017 నాటి RBI రూల్స్ ప్రకారం బ్యాంకు నిర్లక్ష్యం, లోపం, వ్యవస్థ వల్ల జరిగే అనధీకృత లావాదేవీలకు కస్టమర్ జవాబుదారీ అవ్వరని చెప్పారు. ఒకవేళ నిర్లక్ష్యం కస్టమర్‌దే అయితే నష్టం భరించక తప్పదని వెల్లడించారు.
TG: కేంద్రమంత్రి, BJP రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి అధ్యక్షతన HYDలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ఇందులో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అమలు సహా పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం వంటివి చర్చించారు. వీటితో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యాల గురించి విశ్లేషించారు.
తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.
AP: డబ్బుతో ఓట్లు కొనాలని CM చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని YCP MLC అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘స్థానిక సంస్థల్లో YCPకి 600కుపైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఓట్లు కొనాలని కుట్ర పన్నుతున్నారు. కానీ ఓట్లు కొనకుండా YCP విలువలతో కూడిన రాజకీయం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ఆర్మీ కోసం IIT ఇండోర్ స్పెషల్ షూ రూపొందించింది. TENG టెక్నాలజీ వల్ల నడుస్తుంటే విద్యుత్ ఉత్పత్తి జరిగి సోల్‌లోని ఒక డివైజులో స్టోర్ అవుతుంది. దీన్ని వాడుకోవచ్చు. GPSతో రియల్ టైమ్ లొకేషన్ గుర్తించొచ్చు. ఇవి భద్రతతో పాటు జవాన్ల మధ్య సమన్వయం పెంచుతాయి. ఇప్పటికే 10 జతలను DRDOకు పంపించారు. ఈ షూ వేసుకోవడం వల్ల అల్జీమర్స్ బాధితులు, విద్యార్థుల లొకేషన్ తెలుసుకోవచ్చు. ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపర్చుకోవచ్చు.
బంగ్లాదేశ్‌లో నిరసనకారులు ప్రవర్తిస్తోన్న తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఓ జూలోకి ప్రవేశించి అక్కడున్న జంతువులను కొందరు చిత్రహింసలకు గురిచేశారు. జింకను పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకున్న వీడియో వైరలవుతోంది. ఢాకాలోని షేక్ హసీనా తండ్రి షేక్ ముజ్‌బిర్ రెహ్మాన్ విగ్రహంపైకి ఎక్కి ఓ వ్యక్తి మూత్రం పోసి నిరసన తెలిపాడు. దీనిని అక్కడున్నవారంతా సపోర్ట్ చేస్తూ నినాదాలు చేయడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.