India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే EWS కోటాలో 10శాతం సీట్ల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని విద్యాసంస్థల్లోనే అమలు చేసినా NMC ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తిస్తుంది. అయితే సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు వర్తించదని అధికారులు తెలిపారు.
TG: రాష్ట్రంలో 9,982 చెరువులు పూర్తిస్థాయిలో నీటితో నిండాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. మొత్తం 34,716 చెరువులు ఉండగా 3,348 చెరువులు 50-70శాతం నిండినట్లు పేర్కొంది. 6,165 చెరువులు 25-50శాతం, 15,231 చెరువులు 25%లోపు నిండినట్లు వెల్లడించింది.
AP: కేజీబీవీ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీ పారదర్శకంగా నిర్వహించాలని విద్య ఉన్నతాధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. 100% అకడమిక్ ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయాలన్నారు. అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని ఆయన సూచించారు. కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్‌లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగట్ ప్రదర్శనపై సింగర్ చిన్మయి ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘ఆమె కష్టాల్లో అండగా నిలబడకపోతే, ఆమె గెలుపులో క్రెడిట్ తీసుకునే హక్కు నీకు లేదు. అంతే’ అని ట్వీట్ చేశారు. మరో రెజ్లర్ సాక్షి మాలిక్ వినేశ్‌కు అభినందనలు తెలిపారు. ఈ విజయం తమ పోరాటంలో అండగా నిలిచిన వారికే అంకితమని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 37 ఏళ్లు దాటారని, ఆయనకు ఫిట్‌నెస్ లేదని కొందరు విమర్శలు చేస్తుంటారు. అయితే, ఇప్పటికీ తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి మార్పులేదని హిట్ మ్యాన్ నిరూపిస్తున్నారు. ODIల్లో 118.43 స్ట్రైక్ రేట్‌తో అదరగొడుతున్నారు. ఆయన తర్వాత 35 ఏళ్ల తర్వాత బౌలర్లకు చుక్కలు చూపించిన వారిలో క్రిస్ గెయిల్ (108.65SR), డేవిడ్ వార్నర్ (104.23), గిల్‌క్రిస్ట్(101.29), టెండూల్కర్ (93.60SR) ఉన్నారు.
ఏపీలోని పురాతన దేవాలయాలను సంరక్షించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఆలయ భూములను వివిధ మతాలు వారు ఆక్రమించుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇది హిందువులను మనోభావాలను దెబ్బతీస్తోందని, వెంటనే ఆలయాలకు వారి నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పారిస్ ఒలింపిక్స్ మెన్స్ హాకీ సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమితో భారత్‌కు స్వర్ణం మరోసారి కలగానే మిగిలింది. ఈ సారైనా 44 ఏళ్ల కలను సాకారం చేద్దామనుకున్నా ఉత్కంఠ పోరులో జర్మనీ మ్యాచును గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పరాజయానికి ఆ జట్టు స్వీట్ రివేంజ్ తీర్చుకుంది. దీంతో మరోసారి భారత్ కాంస్య పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచులో గెలిచి శ్రీజేశ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదం తెలిపింది. మూడు సంవత్సరాల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఈ నెల 28న రిటైర్ కానున్న దినేశ్ కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. చల్లా స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామం.
1907: ఉమ్మడి ఏపీ రెండవ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి జననం
1925: హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ జననం
1941: విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ మరణం
1947: తెలుగు హాస్య నటులు సుత్తివేలు జననం
1980: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జననం
2018: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణం
● నేడు జాతీయ చేనేత దినోత్సవం
AP: ఆయుధాలతో రక్షణ కల్పించే భద్రతా సిబ్బంది అంటే మాజీ సీఎం జగన్ ఆడుకొనే గేమ్‌లో బొమ్మలు కాదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 40 మండలాల్లో ప్రజలకు రక్షణగా నిలిచే 40 పోలీస్ స్టేషన్లలో ఉండేంత సిబ్బంది మీకు భద్రతా కల్పించాలా? అని ఎక్స్ వేదికగా మాజీ సీఎంను ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన రోజులు పోయి, చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య పాలన వచ్చిందని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.