India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. నేటి నుంచి ఈనెల 15వ తేదీ ఉ.9 గంటల వరకు కమిషన్ <
స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ క్రికెట్‌తో పాటు చదువుపైనా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘60 ఏళ్ల వరకు క్రికెటర్ ఆడలేడు. చనిపోయే వరకు విద్య మనతోనే ఉంటుంది. మంచిగా చదువుకుంటే ఫీల్డ్‌లోనూ మంచి నిర్ణయాలు తీసుకునేందుకు నాకు దోహదపడుతుంది. అందుకే పీహెచ్‌డీ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. KKR ఇతడిని రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 16కు వాయిదా పడ్డాయి. శాసన మండలిని కూడా 16వ తేదీ వరకు వాయిదా వేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో అసెంబ్లీ సమావేశాల తదుపరి కార్యకలాపాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
సూర్యుడు తూర్పున ఉదయించడం, పడమరన అస్తమించడం కామన్. అయితే, పడమరన ఉన్న పసిఫిక్ సముద్రంలో సూర్యుడు ఉదయించి తూర్పున ఉన్న అట్లాంటిక్ సముద్రంలో అస్తమించడం మీరెప్పుడైనా చూశారా? ఇలా చూడగలిగే ఏకైక ప్రదేశం పనామా. ఇది సెంట్రల్ అమెరికాలోని ఓ దేశం. ఇక్కడి ఎత్తైన ప్రదేశం వోల్కానో బారుపై నుంచి చూస్తే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు.
‘పుష్ప-2’ సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్‌లో ఈలలు వేయిస్తోంది. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్‌తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు’ అని ట్వీట్ చేశారు.
‘కాంతార’ సినిమాతో సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథను రాసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హొంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న చిత్రాల్లో ఒక దానికి కథను అందించారని, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపాయి. కాగా, సదరు నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రభాస్‌తో మొత్తం మూడు సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.
సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.
TG: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా ఉండటంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Paytm మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు జోరుమీదున్నాయి. రూ.1007 వద్ద 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 15 నెలల రెసిస్టెన్సీని బ్రేక్ చేశాయి. జపాన్ కంపెనీ PayPayలో రూ.2364 కోట్ల విలువైన వాటాను సాఫ్ట్‌బ్యాంకుకు విక్రయించేందుకు అనుమతి లభించిందని పేటీఎం చెప్పడమే ఇందుకు కారణం. చైనా నుంచి పెట్టుబడులు రావడం, పేమెంట్ బ్యాంకు కష్టాలు తొలగిపోవడంతో కంపెనీ షేర్లు 6 నెలల్లోనే 183% రాబడి అందించాయి.
Sorry, no posts matched your criteria.