news

News February 5, 2025

‘మంగళవారం’కు సీక్వెల్ సిద్ధం?

image

2023లో చిన్న సినిమాగా వచ్చిన మంగళవారం సినిమా ఘన విజయాన్ని దక్కించుకుంది. దాని దర్శకుడు అజయ్ భూపతి ఆ మూవీకి సీక్వెల్ తెరక్కించనున్నట్లు తెలుస్తోంది. పాయల్ రాజ్‌పుత్ స్థానంలో మరో కొత్త హీరోయిన్ నటించొచ్చని టాక్ నడుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. పూర్తి క్యాస్టింగ్ వివరాల్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

News February 5, 2025

క్రేజీ రికార్డ్.. దూబే జట్టులో ఉంటే భారత్ గెలుపు పక్కా

image

భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఓ క్రేజీ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. అతను జట్టులో ఉన్న 30 T20లలో IND వరుసగా విజయం సాధించింది. దూబే 2019 నవంబర్ 3న బంగ్లాపై తొలి మ్యాచ్ ఆడగా ఇండియా ఓడిపోయింది. తొలి 5 మ్యాచ్‌లలో జట్టుకు 2 ఓటములు ఎదురయ్యాయి. 2019 డిసెంబర్ 11న విండీస్‌పై గెలుపు నుంచి దూబే టీమ్‌లో ఉన్న ప్రతిసారీ విజయం సొంతమైంది. దీంతో ఇతనిది లక్కీ జాతకమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News February 5, 2025

విద్యార్థులకు ALERT.. దరఖాస్తులకు ఈ నెల 19 లాస్ట్

image

APలోని 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 2025-26కు 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 19 వరకు <>దరఖాస్తు చేసుకోవచ్చు<<>>. 31-3-2025 నాటికి 10-13 ఏళ్ల వయసు ఉండి, ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఒక్కో స్కూల్‌లో 60 సీట్లు(బాలురకు 30, బాలికలకు 30) ఉంటాయి. ఇంగ్లిష్, CBSE సిలబస్‌లో బోధన ఉంటుంది. ఈ నెల 25న రాత పరీక్ష ఉంటుంది. అందులో సాధించిన మెరిట్‌, రిజర్వేషన్‌ బట్టి సీట్లను భర్తీ చేస్తారు.

News February 5, 2025

రూ.86వేలు దాటిన తులం బంగారం

image

బంగారం ధరలు మండిపోతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 పెరిగి రూ.79,050లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరగడంతో రూ.86,240 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News February 5, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన

image

హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి ఈరోజు తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచీ విమానం కోసం ఎయిర్‌పోర్టులో పడిగాపులు గాస్తున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇంకా రాలేదని, కనీసం సరైన సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవని మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శన సమయం దాటిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 5, 2025

Stock Markets: నెగటివ్ సంకేతాలొచ్చినా లాభాల్లోనే..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,779 ( +40), సెన్సెక్స్ 78,609 (+33) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మీడియా, మెటల్, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. BPCL, INDUSIND BANK, ONGC, HINDALCO, SHRIRAM FIN టాప్ గెయినర్స్. ASIANPAINT, NESTLE, TITAN, EICHER టాప్ లూజర్స్.

News February 5, 2025

ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ

image

‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 14లోపు ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం. వరుణ్ ధావన్, కీర్తి, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ ‘తేరీ’(పోలీసోడు) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.

News February 5, 2025

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్

image

వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ChatGPT సేవల కోసం ఇప్పటికే 18002428478 నంబర్‌ను తీసుకురాగా ఇప్పుడు సేవల పరిధిని పెంచింది. ప్రస్తుతం టెక్ట్స్ మెసేజ్‌లకు మాత్రమే రిప్లైలు ఇస్తూ ఉండగా ఇకపై ఆడియో, ఫొటో ఇన్‌పుట్స్‌కూ సమాధానాలు ఇవ్వనుంది. ఆ ఫొటో/వాయిస్ నోట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ChatGPT స్పందిస్తుంది. ఆ నంబర్‌ను సేవ్ చేసుకుని మనకు కావాల్సిన ప్రశ్నలకు ఆన్సర్లు తెలుసుకోవచ్చు.

News February 5, 2025

క్లాస్‌రూమ్‌లో విద్యార్థితో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం

image

బెంగాల్‌లోని వర్సిటీలో మహిళా ప్రొఫెసర్ విద్యార్థితో క్లాస్‌రూమ్‌లో <<15302833>>పెళ్లి చేసుకోవడం<<>> వైరలైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అధికారులు సెలవుపై పంపారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ రాజీనామా లేఖను రిజిస్ట్రార్‌ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై వర్సిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా ఆ పెళ్లి ఓ ప్రాజెక్టులో భాగమని ప్రొఫెసర్ చెబుతున్నారు.

News February 5, 2025

నేడు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

image

TG: BC కులగణన, SC వర్గీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష BRS విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై కాంగ్రెస్ సర్కారు వివరణ ఇవ్వనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సబ్ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.