India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

T20 క్రికెట్(ఇంటర్నేషనల్+లీగ్స్)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్(AFG) చరిత్ర సృష్టించారు. 460 మ్యాచ్‌లలో 632 వికెట్లు పడగొట్టి బ్రావో(631 వికెట్లు)ను వెనక్కినెట్టారు. SA20లో MI కేప్‌టౌన్ తరఫున ఆడుతున్న అతను పార్ల్ రాయల్స్‌పై 2 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించారు. 26 ఏళ్లకే ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. త్వరలోనే వెయ్యి వికెట్లకు చేరుకోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

BGT ఆఖరి టెస్టులో బుమ్రా గాయపడటం టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చిందని బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. ఆరోజు బుమ్రా ఫిట్‌గా ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నారు. ‘బుమ్రా గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడం దురదృష్టకరం. ఆయన ఉండి ఉంటే ఆ మ్యాచ్ కచ్చితంగా గెలిచేవాళ్లం. ఫలితంగా సిరీస్ 2-2తో సమమై మాపై విమర్శలు తప్పేవి. ఏదేమైనా.. మాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా మేం ఆడలేకపోయామన్నది వాస్తవం’ అని స్పష్టం చేశారు.

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉ.7 నుంచి సా.6 వరకు కొనసాగనుంది. సా.6.30 తర్వాత ఆక్సిస్ మై ఇండియా, సీఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య, IPSOS తదితర ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. ఆ వివరాలను వేగంగా, సమగ్రంగా, విశ్లేషణలతో WAY2NEWSలో తెలుసుకోవచ్చు.

విదేశాలకు అమెరికా అందించే సాయం USAID. భారత్‌లోనూ ఎన్నో ఏళ్లుగా ఈ సాయం కొనసాగుతోంది. దీని ద్వారా గత ఏడాది భారత్‌కు రూ.1228 కోట్లు అందాయి. క్షయ, HIV నివారణకు, లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణానికి యూఎస్ఎయిడ్ ఉపకరించింది. అయితే ఆ నిధుల నిలిపివేత ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండకపొవచ్చు. మొత్తంగా ఏటా 160దేశాలకు సాయం చేసేందుకు రూ.3.83 లక్షల కోట్ల మేర నిధుల్ని అమెరికా వెచ్చిస్తోంది.

ప్రముఖ సీనియర్ నటి పుష్పలత(87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నిన్న చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో పుష్పలత నటించారు. తెలుగులో చెడపకురా చెడేవు, ఆడబిడ్డ, రాము, యుగపురుషుడు, వేటగాడు తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఈమె కూతురు మహాలక్ష్మి హీరోయిన్‌గా రెండు జెళ్ల సీత, ఆనందభైరవి చిత్రాల్లో నటించారు.

నిన్న ఢిల్లీలో పర్యటించిన మంత్రి లోకేశ్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం నివాసం 1-జన్‌పథ్‌లో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. ఏపీ, బిహార్, దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఐప్యాక్ నుంచి బయటికొచ్చిన ప్రశాంత్ బిహార్‌లో ‘జన్ సురాజ్’ పార్టీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

నెల్లూరు(D) రామాయపట్నం పోర్టు సమీపంలో BPCL రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. 6వేల ఎకరాల్లో ₹96,862Crతో దీన్ని నిర్మించనుందని రాజ్యసభలో చెప్పారు. ఏటా 9-12 మి.టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నెలకొల్పుతామన్నారు. MP మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. పెట్టుబడిలో 75 శాతాన్ని ప్రోత్సాహకాల రూపంలో 25 ఏళ్లలో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

TG: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిబంధనలపై చర్చించేందుకు విద్యాకమిషన్ రేపు హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనుంది. వర్సిటీల్లో ఆచార్యులు, ఉపకులపతుల నియామకాల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. యూజీసీ ముసాయిదా నిబంధనలే ప్రధాన చర్చనీయాంశంగా తెలుస్తోంది. ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, తిరుపతిరావు తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారని సమాచారం.

ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కాగా.. గత నెల 13న మొదలైన కుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది.

APలో టెన్త్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17-28 వరకు రోజు విడిచి రోజు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. 17న హిందీ, 19న ఇంగ్లిష్, 21న తెలుగు/ఉర్దూ/కన్నడ/ఒరియా/తమిళం, 24న మ్యాథ్స్, 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, 28న సోషల్, ఆర్థిక శాస్త్ర పరీక్షలు నిర్వహిస్తారు. కాగా రెగ్యులర్ పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు జరుగుతాయి.
Sorry, no posts matched your criteria.