news

News February 5, 2025

ప్రభాస్ సినిమాలో సాయిపల్లవి?

image

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న ఫౌజీ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో డార్లింగ్ ప్రేయసి పాత్ర కోసం సాయి పల్లవిని మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాకే హైలైట్‌గా నిలిచేలా ఆ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News February 5, 2025

డీప్‌సీక్‌ను బ్యాన్ చేసిన ఆస్ట్రేలియా

image

ఏఐ రంగంలో ప్రపంచాన్ని షేక్ చేస్తున్న చైనా డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. ఆ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోమ్ అఫైర్స్ సెక్రటరీ స్టెఫానీ తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలు, మొబైల్ పరికరాల్లో డీప్‌సీక్‌ ఉత్పత్తులను నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సౌత్ కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ కూడా డీప్‌సీక్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News February 5, 2025

నేడే ఢిల్లీ పోలింగ్.. సర్వం సిద్ధం

image

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. వరుసగా మూడో సారి గెలవాలని ఆప్, 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావాలని బీజేపీ, పునర్వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయి. ఢిల్లీలో 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 35వేల మంది పోలీసులు, 15వేల మంది హోంగార్డులు, 200 కంపెనీల సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.

News February 5, 2025

మేం ముగ్గురం మిత్రులమే: గిల్

image

ఇండియా తరపున ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడినా అభినందించాలని భారత క్రికెటర్ శుభ్‌‌మన్ గిల్ అన్నారు. అభిషేక్ తన బాల్య మిత్రుడని, జైస్వాల్ సైతం మంచి స్నేహితుడని తెలిపారు. మా ముగ్గురి మధ్య ఎటువంటి పోటీతత్వం ఉండదని అన్నారు. ఇండియా కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్ బాగా ఆడేలా ప్రయత్నించాలన్నారు. అంతేగాని ఒకరు బాగా ఆడకూడదని కోరుకోవటం సరికాదని శుభమన్ పేర్కొన్నారు.

News February 5, 2025

English Learning: Antonyms

image

✒ Hapless× Fortunate, Lucky
✒ Haughty× Humble, Submissive
✒ Hideous× Attractive, alluring
✒ Heretic× Conformable, religious
✒ Harmony× Discord
✒ Hamstrung× Strengthen, Encourage
✒ Honor× Denunciation, Shame
✒ Hasty× Leisurely, Cautious
✒ Humility× Boldness, Pride

News February 5, 2025

ప్రణబ్ మెమోరియల్ పక్కనే మన్మోహన్ స్మారకానికి స్థలం?

image

మాజీ PM, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్‌ కోసం కేంద్రం ఢిల్లీలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్ ఘాట్‌ కాంప్లెక్స్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం పక్కనే ల్యాండ్‌ను ఇస్తామని మన్మోహన్ కుటుంబీకులకు తెలిపినట్లు సమాచారం. వారు సమ్మతి తెలపగానే మెమోరియల్ నిర్మాణానికి రూ.25 లక్షలు అందించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది DEC 26న మన్మోహన్ మరణించిన విషయం తెలిసిందే.

News February 5, 2025

SSMB29: ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదా.. విలనా?

image

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఆమె విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్. కాగా ఈ మూవీ కోసం కాశీలో ఉండే మణికర్ణికా ఘాట్‌ తరహాలో హైదరాబాద్‌లో సెట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News February 5, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!
తాత్పర్యం: ఈ లోకంలో పట్టణానికి వ్యాపారి, వరి పొలానికి నీరు, ఏనుగుకు తొండము, సంపదకు స్త్రీ ప్రాణాధారము. అవి లేకపోతే జీవం ఉండదు.

News February 5, 2025

ఉగాది నుంచి P4: సీఎం చంద్రబాబు

image

AP: పేదరిక నిర్మూలనకు ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఉగాది నుంచి P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్‌షిప్) విధానాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా టాప్‌లో ఉన్న 10% మంది 20% మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పారిశ్రామివేత్తలు, NRIలు, ఇతర ధనవంతులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

News February 5, 2025

ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

image

✒ 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒ 1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒ 1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒ 1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒ 1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒ 2008: వన్డేల్లో సచిన్ 16,000 పరుగులు పూర్తి చేశారు